Kalpika Ganesh: కల్పికా గణేషన్ చాలామందికి ఈమె పేరు చెప్పిన వెంటనే ఈమె గుర్తుకు రాకపోవచ్చు కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంతకు అక్క పాత్రలో నటించిన నటి అంటే మాత్రం ఈమె ముఖచిత్రం అందరికీ గుర్తుకు వస్తుంది.పలు సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలోను లేదా అక్క పాత్రలలోను నటిస్తూ సందడి చేస్తున్నటువంటి ఈమె చాలా వరకు వివాదాలకు దూరంగా ఉండేవారు.
అసలు ఈమె గురించి చాలామందికి తెలిసి ఉండదు. అయితే తాజాగా ఈమె సమంత నటించిన యశోద సినిమాలో కూడా ఓ పాత్రలో నటించారు. ఈ సినిమా అనంతరం ఈమె సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేయడమే కాకుండా పలు ఇంటర్వ్యూలలో హాజరవుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.
ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తనని సోషల్ మీడియాలో చాలామంది ట్రోల్ చేస్తున్నారని ఈమె మండిపడ్డారు. అయితే తాను సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా వారు న్యాయం చేయకపోవడం కాకుండా మీ ప్రవర్తన శైలే మీకు ఇలాంటి ఇబ్బందులను తెచ్చిపెడుతోంది అంటూ చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారని సోషల్ మీడియా వేదికగా సైబర్ క్రైమ్ పోలీసులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
పోలీసులను కూడా వదలని కల్పికా
ఇలా ఈమె సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులను కూడా తిట్టడంతో..నేటిజెన్లు స్పందించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎవరు కూడా ఇలాంటి సమాధానం చెప్పరు అసలు నువ్వు ఎక్కడ ఎవరికి ఫిర్యాదు చేశావో అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు ఈమెను ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఈమె ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్‌ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…