Kalyan dev: చిరంజీవి చిన్న అల్లుడుగా కళ్యాణ్ దేవ్ అందరికీ పరిచయమయ్యారు. ఈయన శ్రీజను రెండో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత ఈయన కూడా హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ దంపతులకు ఒక చిన్నారి జన్మించిన తర్వాత ఇద్దరు మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ కూడా విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకొని విడిపోయినటువంటి ఈ జంట తమ విడాకులు విషయాన్ని అధికారకంగా ప్రకటించకపోయిన ప్రస్తుతం వేరువేరుగా ఉంటున్నారు. అయితే తన కుమార్తె తన వద్దనే శ్రీజ ఉంచుకున్నారు నెలలో రెండు మూడు సార్లు తన తండ్రి వద్దకు పంపిస్తూ ఉంటారు.
ఇలా కళ్యాణ్ దేవ్ తన కుమార్తె నవిష్క వచ్చినప్పుడు తనతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఉగాది పండుగ సందర్భంగా తన కూతురు తన ఇంటికి రావడంతో ఎంతో ఘనంగా ఉగాది వేడుకలను జరుపుకున్నారని తెలుస్తుంది.
కూతురితో ఉగాది…
సాంప్రదాయమైన దుస్తులలో ఈ తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.



























