Kamal R Khan: కమల్ ఆర్ ఖాన్ (KRK) బాలీవుడ్, భోజ్ పుర్ నటుడిగా నిర్మాతగా సినీ క్రిటిక్ గా అందరికి సుపరిచితమే. ఈయనపలు సినిమాలకు తన రివ్యూ ఇస్తూ పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తుంటారు. అంతేకాకుండా తరచూ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీల గురించి ఈయన చేసే కామెంట్స్ వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి. ఇలా తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఈయన ఏకంగా బాలీవుడ్ సెలబ్రిటీల గురించి ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి కె ఆర్ కె మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ నడుస్తుందని తెలిపారు.ముందు ప్రెగ్నెన్సీ ఆ తర్వాత పెళ్లి అనే ట్రెండ్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తుందని ఈయన తెలియజేశారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా పెళ్లయిన కొత్త జంట కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారని ఈయన కామెంట్ చేశారు.
ఈ క్రమంలోనే గతంలో అలియా భట్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడంతో ఈమె హడావిడిగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన ఏడు నెలలకి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే తాజాగా కె ఆర్ కె తాజాగా పెళ్లయిన జంట అంటూ కియారా సిద్ధార్థ మల్హోత్రా జంటను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ పలువురు ఈయన వ్యాఖ్యలపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Kamal R Khan: ముందు ప్రెగ్నెన్సీ… తర్వాత పెళ్లి
ఇక ఈయన పరోక్షంగా కియారా దంపతులను ఉద్దేశిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా.. పెళ్లికి ముందే కియారా గర్భవతి అనే విషయాన్ని ఇలా తెలియజేస్తున్నారా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.మరి కె ఆర్ కె ఎవరిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Bollywood’s new trend is, that first get pregnant and then get married. According to sources, Bollywood Ki recently Huyee Marriage Ka Bhi Yahi Formula Hai. Accha Hai.
— KRK (@kamaalrkhan) February 12, 2023

































