RRR Movie: దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాల నడుమ మార్చి 25 వ తేదీ అత్యధిక థియేటర్లలో విడుదల అయి బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా అత్యధిక కలెక్షన్లను రాబడుతూ ప్రభంజనం సృష్టిస్తోంది.

ఇక ఈ సినిమాకి దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే నటి కంగనా రనౌత్ ఈ సినిమాపై మొదటిసారిగా స్పందించారు.

ఈ సందర్భంగా కంగనా రనౌత్ రాజమౌళి గురించి మాట్లాడుతూ ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి సర్ ఇండియాలోనే ఒక గొప్ప దర్శకుడు పరాజయం అంటూ లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. రాజమౌళిలో అసలైన గొప్ప విషయం ఆయన సాధించిన విజయాలు కాదు.. సింప్లిసిటీ. దేశంపై ఆయనకు ఉన్న గౌరవం, ధర్మంపై ఆయనకు ఉన్న ప్రేమ అద్భుతం అంటూ ఇవే అందరికీ రోల్ మోడల్ గా నిలుస్తున్నాయి… అంటూ కంగనా రాజమౌళి ప్రశంసలు కురిపించారు.
అప్పటివరకు సినిమా చూడలేదు…
ఈ విధంగా కంగనారనౌత్ రాజమౌళి పై ప్రశంసలు చేసే ముందు వరకు ఈ సినిమాని చూడలేదని, ఈ కామెంట్ చేసిన అనంతరం ఈ సినిమా తన కుటుంబ సభ్యులతో కలిసి చూశానని తెలియజేశారు. అయితే సినిమా చూడకుండానే ఆయనపై ఇలాంటి ప్రశంసలు కురిపించడంతో కంగనా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతుంది.


































