Jaggesh: కన్నడ నటుడు జగ్గేష్ తరచూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తన ఆలోచనలను పంచుకుంటాడు. ఎప్పుడూ ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే అతడు కేవలం సినిమాలకే కాకుండా వ్యక్తిగత విషయాలపై కూడా సమాచారాన్ని అందజేస్తున్నారు. ఇలా అతడు తన అభిమానులకు దగ్గర అవుతూ ఉన్నాడు.

జగ్గేష్ వెండితెర కార్యక్రమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాలతో కూడా బిజీగా ఉన్నాడు. ఇండస్ట్రీకి వచ్చి మూడున్నర దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ అతడికి అదే డిమాండ్ ఉంది. చాలా బిజీగా ఉన్నప్పటికీ.. జగ్గేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటారు. తన ఆలోచనలకు పంచుకుంటూ.. సమస్యలను పంచుకుంటూ దగ్గర అయ్యాడు.

ఇక అతడి వ్యక్తిగత విషయానికి వస్తే.. సినిమాకు తక్కువ కాదనే రేంజ్ లో ఉంటుంది. అతడి జీవితంలో జరిగిన కొన్ని ఘటనలు ఎన్నటికీ మర్చిపోలేము అన్నట్లు పేర్కొన్నాడు. అలాంటి కొన్ని సంఘటనలను ఆయన తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటారు.
నా చేతిలో చిల్లిగవ్వ లేదు..
మంగళవారం (జనవరి 5) ఆయన పెద్ద కుమారుడు గురురాజ్ పుట్టినరోజు సందర్భంగా.. ఇది తన కొడుకు గురించి భావోద్వేగపూరితమైన పోస్టును ట్విట్టర్ లో పోస్టు చేశాడు. 1987 సంవత్సరంలో తాను తండ్రిని అయ్యానని.. అప్పడు తన దగ్గర చిల్లి గవ్వలేదని.. జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలన్న భయం ఎక్కువగా వెంటాడిందన్నారు. అప్పడు ఆర్థికంగా తన కొడకుతో సమానంగా ఉన్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రిగా తాను ఓడిపోయానని.. దిక్కుతోచని స్థితిలో మంత్రాలయం గురురాయర ముందు నిలిచి నా గోడును చెప్పుకున్నా’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.ప్రస్తుతం అతడి ట్వీట్ వైరల్ గా మారింది..
5/1/1987…ಬದುಕು ಹೇಗೆ ನಿಭಾಯಿಸುವುದು ಎಂದು ಕೊರಗುತ್ತಿದ್ದ ದಿನಗಳು! ರಾಯರಪ್ರಸಾದ ಮಗ ಗುರುರಾಜನ ರೂಪದಲ್ಲಿ ಬಂತು!
— ನವರಸನಾಯಕ ಜಗ್ಗೇಶ್ (@Jaggesh2) January 5, 2021
ಅವನಿಗಾಗಿ ಗೆಲ್ಲಲೆ ಬೇಕು ಒಂದುದಿನ ಎಂಬ ಛಲ ಮೂಡಿತು ಅವನು ಬೆಳೆದಂತೆ ನಾನು ಬೆಳೆದೆ!ಸಾತ್ವಿಕ ಸಂಭಾವಿತ ಮಗ ಗುರುರಾಜ ಹುಟ್ಟಿದದಿನ ಇಂದು!ಮನತುಂಬಿ ನನ್ನ ಶುಭಹಾರೈಕೆ ನೀವು ಹರಸಿ..ಧನ್ಯವಾದ pic.twitter.com/pUNswAvsSg
































