కన్నడ యాక్టర్ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ గురించి మనందరికీ తెలిసిందే. ఇతను తన నటనతో ఎంత మంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. ఇతను ఒక మంచి డాన్సర్ కూడా. ఇతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన గుండెపోటుకు గురవ్వడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగళూరులో విక్రమ్ ఆస్పత్రికి తరలించారు.

ఈ వార్త తెలుసుకున్న పునీత్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పునీత్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఐసీయూలో చికిత్స తుది శ్వాస విడిచారు. పునీత్ మరణంతో ఒక్కసారిగా కన్నడ సినీ ఇండస్ట్రీ తో పాటు, పునీత్ కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
పునీత్ మరణంతో ఇండస్ట్రీకి తీరని లోటు ఏర్పడింది అంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఈరోజు ఉదయం అతను జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక్కసారిగా కండిషన్స్ సిరీయస్ అవ్వడంతో ఒక్కసారిగా ఐసీయూలో షిప్ చేసి చికిత్స అందిస్తుండగా వెంటిలేటర్ పై తుది శ్వాస విడిచారు.
అయితే పునీత్ క్షేమంగా ని తిరిగి వస్తాడు అనుకున్న అభిమానులకు ఒక్కసారిగా అతడు మరణించాడు అన్న మాట వినగానే నాకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.































