NBk107: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా విజయోత్సవంలో ఉన్నారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వెండితెరపై అద్భుతమైన అవకాశాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ మరోవైపు ఆహా ఓటీటీలో వస్తున్న ‘అన్‌స్టాపబుల్ షో’కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని క్రాక్ సినిమా ద్వారా సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ నటిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణతో పోటీ పడటం కోసం సీనియర్ హీరో అర్జున్ నటిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాజాగా చిత్రబృందం అధికారికంగా తెలియజేశారు. కానీ గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణతో పోటీ పడటానికి శాండిల్ వుడ్ స్టార్ ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
ఒక్క ప్రకటనతో సినిమాపై పెరిగిన అంచనాలు..
ఈ సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం కోసం కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ను రంగంలోకి దింపినట్లు చిత్రబృందం అతనికి స్వాగతం పలుకుతూ అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ విషయాన్ని తెలియజేస్తూ… “వేరీ హ్యాపీ టు వెల్‌కమ్ ది సాండల్‌వుడ్ సెన్సేషన్ దినియా విజయ్. ఈ సినిమాతో విలనిజానికి సరికొత్త నిర్వచనం ఇద్దాం.”అని ట్వీట్ చేశారు. ఇలా ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోయే హీరో పేరు చెప్పగానే వీరిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో అర్థమవుతుంది. ఇలా విలన్ని ప్రకటించగానే ఈ సినిమాపై ఇప్పటికీ ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
Very happy to welcome the Sandalwood Sensation #DuniyaVijay on board to #NBK107 ????????
— Gopichandh Malineni (@megopichand) January 3, 2022
Redefines the Villainism with #NBK107 ????????
NataSimham #NandamuriBalakrishna @shrutihaasan @officialviji @MusicThaman @MythriOfficial pic.twitter.com/x6mYe37rzu



























