Kantara Movie: కన్నడ చిత్ర పరిశ్రమలో రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార.ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ కన్నడ చిత్ర పరిశ్రమలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. హోంభలే ఫిలిమ్ సమస్థ వారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాని అన్ని భాషలలో విడుదల చేశారు.

ఇక ఈ సినిమా పెద్ద ఎత్తున లాభాలను అందుకొని భారీ కలెక్షన్లను రాబట్టింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చేటటువంటి వరాహ రూపం అనే పాట ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని చెప్పాలి.ఇలా ఈ సినిమా విడుదలయ్యి దాదాపు నెలరోజులు కావస్తున్న తరుణంలో ఈ సినిమా గురించి ఓ వివాదం చోటు చేసుకుంది.
ఈ సినిమాలో వరాహ రూపం అనే పాట కాపీ కొట్టారంటూ ‘తైక్కుడం బ్రిడ్జ్’ మ్యూజిక్ బ్యాండ్ వారు ఆరోపణలు చేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవరసం అనే పాట నుంచి వరాహ రూపం అనే పాటను కాపీ చేశారంటూ
తైక్కుడం బ్రిడ్జ్ ఆరోపణలు చేయడమే కాకుండా ఈ కాఫీ ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ వీరు హెచ్చరించారు.

Kantara Movie: ఏం ఆశించి ఆరోపణలు చేస్తున్నారు…
ఈ విధంగా ఈ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ఈ విధమైనటువంటి కాపీ వివాదం తెరపైకి రావడంతో ఏం ఆశించి తైక్కుడం బ్రిడ్జ్ వారు ఆరోపణలు చేస్తున్నారు అంటూ పలువురు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇలాంటి ఆరోపణలు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే ఈ పాటపై కాపీ ఆరోపణలు రావడంతో ఇప్పటివరకు కాంతారా సినిమా చిత్ర బృందం ఏ విధంగాను స్పందించకపోవడం గమనార్హం.































