RRR-Kapil Sharma: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను దాదాపు 10 భాషల్లో జనవరి 7న విడుదల చేయనున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లను జరుపుకుంటోంది. మొన్న ముంబైలో జరపుకోగా.. నిన్న తమిళానాడులో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక తాజాగా ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ గా నడుస్తున్న ది కపిల్ శర్మ షో కి వెళ్లారు ట్రిపుల్ ఆర్ టీమ్. దీనిలో నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ మరియు చిత్రనిర్మాతలు, దర్శకుడు SS రాజమౌళి పాల్గొన్నారు. కపిల్ శర్మ షో అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తన మాటలతో కడుపుబ్బా నవ్విస్తాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. దీనిలో మొత్తం అంతా సందడిగా సాగిపోయింది. ప్రోమోలో కపిల్ రాజమౌళిని హిందీలో మాట్లాడగలవా అని అడిగాడు. దానికి చిత్ర నిర్మాత “నేను మాట్లాడగలను, కానీ నేను హిందీ మాట్లాడుతున్నానో వారికి తెలియదు” అని రాజమౌళి బదులిచ్చారు.
చరణ్ పంచ్ లకు కపిల్ శర్మ షాక్..
ఇలా వారి మాటలతో నవ్వించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు కపిల్ శర్మ ఓ కొత్త అర్థాన్ని ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ అంటే రూపాయి రూపాయి రూపాయి అంటూ రాజమౌళిని ఆటపట్టించాడు. దీనికి అక్కడ ఉన్న వాళ్లు ఫుల్ గా నవ్వేసుకున్నారు. చరణ్ ను కపిల్ శర్మ ఓ ప్రశ్న అడుగుతాడు. మీకు బిజినెస్ లు ఎక్కువగా ఉన్నాయి కదా.. ఎందుకు సినిమాలు తీస్తున్నారు.. బిజినెస్ లు చేసుకోవచ్చు కదా అని అడగ్గా.. తాను బిజినెస్ లు చూసుకుంటూ ఉంటే.. కపిల్ శర్మ షోకి వచ్చే వాడిని కాదు కాదా అంటూ కౌంటర్ ఇవ్వగానే.. అందరు నవ్వుకున్నారు. ఇలా ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.































