Yediyurappa Granddaughter Dead: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మనవరాలు సౌందర్య (30) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా సౌందర్య మృతి చెందడంతో యడియూరప్ప ఇంటిలో విషాదం చోటు చేసుకుంది.

బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో సౌందర్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

సౌందర్య యడియూరప్ప కుమార్తె పద్మావతి కూతురు అని తెలుస్తోంది. పద్మావతి రాష్ట్ర రాజకీయాలలో లేకపోవటంవల్ల ఈమె గురించి పెద్దగా పరిచయం లేదు. సౌందర్య వృత్తిపరంగా వైద్యురాలు. ఈమె బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తోంది.
వైద్యుడిని వివాహమాడిన సౌందర్య…
సౌందర్య వృత్తిపరంగా వైద్యురాలు కావడంతో ఆమె 2018లో తన తోటి డాక్టర్ ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది.ఇలా సౌందర్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతున్న సమయంలో ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈమె మరణించడంతో ఈమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బౌరింగ్ ఆస్పత్రికి చేరుకున్నారు.
The postmortem of Soundarya, the granddaughter of former Karnataka CM BS Yediyurappa's granddaughter, is underway at Bowring and Lady Curzon Hospital in Bengaluru. She was found hanging at a private apartment in Bengaluru.
— ANI (@ANI) January 28, 2022
Visuals from the hospital. pic.twitter.com/tgBW52E9Rt































