బుల్లితెర శోభన్ బాబుగా ఎంతోమంది ప్రేక్షక అభిమానులను సంపాదించుకున్న నటుడు డాక్టర్ బాబు అలియాస్ పరిటాల నిరుపమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిరుపమ్ ప్రస్తుతం బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఉన్న నటుడిగా కొనసాగుతున్నాడు.నిరుపమ్ నటిస్తున్నటువంటి కార్తీకదీపం సీరియల్ ఎంతటి ప్రేక్షకాదరణ పొందినదో మనకు తెలిసిందే.ఈ సీరియల్ కి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాకుండా విదేశాలలో ఉండే తెలుగు ప్రేక్షకులు సైతం అభిమానులుగా మారిపోయారు.
నిరుపమ్ రచయిత ఓంకార్ గారి కొడుకు. మొదట్లో వెండితెరపై అవకాశాల కోసం ఎదురు చూసిన డాక్టర్ బాబుకు అక్కడ అవకాశాలు రాకపోవడంతో తెరపైకి వచ్చి అద్భుతమైన విషయాన్ని సాధిస్తున్నాడు. ప్రస్తుతం 2, మూడు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే డాక్టర్ బాబు ఈటీవీలో ప్రసారమైన చంద్రముఖి సీరియల్ ద్వారా పరిచయమయ్యారు.
ఈ సీరియల్స్ ద్వారా కన్నడ నటి మంజుల కార్తీక్ బాబుకి పరిచయమయ్యారు. ఈ విధంగా చంద్రముఖి సీరియల్ ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.ఈక్రమంలోనే 2010వ సంవత్సరంలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ దంపతులకు ఒక కొడుకు ఉన్నారు.ఈ విధంగా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న డాక్టర్ బాబు కేవలం కార్తీకదీపం సీరియల్ ద్వారా ప్రతిరోజుకు 20 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఈ విధంగా నిరుపమ్ నెలకు సుమారు పది లక్షల వరకు సంపాదిస్తున్నారని తెలుస్తోంది.భవిష్యత్తులో ఇతనికి రెమ్యునరేషన్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా నిరుపమ్ కి వైజాగ్ లో సుమారు 5 కోట్ల విలువచేసే ఆస్తులు ఉన్నాయని, హైదరాబాద్ శ్రీరామ్ నగర్ కాలనీలో సుమారు 80 లక్షల విలువచేసే ఫ్లాట్ కూడా ఉందని తెలుస్తోంది. ఇక డాక్టర్ బాబు భార్య మంజుల నటిగా పలు సీరియల్స్ లో నటిస్తూ ఆమె కూడా బాగానే సంపాదిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే కార్తీక్ బాబుకు సుమారు ఏడెనిమిది కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది.































