బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో మనకు తెలిసిందే. ఈ సీరియల్ లో దీప పాత్ర తర్వాత ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే పాత్ర ఏదైనా ఉంది అంటే అది మోనిత పాత్రని చెప్పవచ్చు. సీరియల్ లో నెగటివ్ పాత్రలో కనిపించే మోనిత అసలు పేరు శోభా శెట్టి. ఈమెది స్వస్థలం బెంగళూరు. అసలు పేరు శోభా శెట్టి అయినప్పటికీ ఈమెను చాలామంది మోనితగానే గుర్తు పెట్టుకున్నారు.

ఇక అందరు టీవీ సెలబ్రిటీల మాదిరిగానే మోనిత కూడా గత కొద్ది రోజుల క్రితం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే మోనిత చేసింది కేవలం మూడే మూడు వీడియోలు. ఒకటి తన హోమ్ టూర్, రెండవ వీడియో మంత్రాలయం టూర్,మూడవ వీడియో కార్తీకదీపం సీరియల్ లో శ్రీ రామ్ నగర్ బస్తీలో దీప నివస్తున్నటువంటి ఇంటిని వంటలక్క హోమ్ టూర్ అంటూ మూడు వీడియోలను చేసింది.
మోనిత చేసిన ఈ మూడు వీడియోలు ఒక్కొక వీడియో 1 మిలియన్ వ్యూస్ ను సాధించాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో వంటలక్క హోమ్ టూర్ ట్రెండింగ్ అవుతోంది. ఈ విధంగా మోనిత సీరియల్ లో మాత్రమే కాకుండా.. తన యూట్యూబ్ ఛానల్ లో కూడా తన దూకుడును ప్రదర్శిస్తోందని చెప్పవచ్చు.
ఇక తెలుగులో మాత్రమే కాకుండా శోభా శెట్టి అలియాస్
మోనిత కన్నడలో పలు సీరియల్స్, సినిమాలలో చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.మోనిత దూకుడు ఈ విధంగానే ఉంటే రికార్డులు సృష్టించడం ఖాయమని పలువురు భావిస్తున్నారు.


































