Yashwanth: తెలుగు బుల్లితెరపై అత్యధికంగా రేటింగ్ తో ప్రసారం అవుతున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ అంటే తెలియని వారుండరు. ఇక అందులో నటించే వాళ్లకు బయట విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇటు సినిమాల్లో కూడా విపరీతంగా ఆఫర్స్ వస్తున్నాయి.

కార్తీక దీపంలో విలన్ పాత్రలో మెప్పిస్తున్న నటి శోభాశెట్టి. మోనితా క్యారెక్టర్ లో ఆమె లీనపోయి.. సీరియల్ కు హైలెట్ గా నిలిచింది. ఇక అంతటి పేరున్న వ్యక్తులలో మెయిన్ లీడ్లో నటించే వారు కాకుండా.. కార్తీక్ తమ్ముడిగా అలరిస్తున్న నటుడు ఆదిత్య ( యశ్వంత్ ). ఇతడు కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య చిన్న కొడుకుగా, డాక్టర్ బాబు కార్తీక్ తమ్ముడిగా మెప్పిస్తున్నాడు.

ఇక ప్రస్తుతం మోనిత, ఆదిత్యలు ఇప్పుడు కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ‘బుజ్జి బంగారం’ అంటూ రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మంత్రాలయంలో విడుదల చేశారు. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామికి విపరీతమైన అనుచరి అయిన శోభ తనకు ఇష్టమైన ప్రదేశంలో తన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.
ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ ..
ప్రస్తుతం ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ గా మారింది. న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఇక యశ్వంత్ విషయానికి వస్తే.. చిన్నప్పటి నుంచే అతడికి నటనపై ఆసక్తి. సౌదామిని’, ‘మంచుకురిసే వేళలో’, ‘బాబు సాఫ్ట్ వేర్’ వంటి సినిమాల్లోనూ హీరోగా నటించాడు యశ్వంత్. ‘నాతి చరామి’, ‘ ఏదో మాయలా’, ‘వెయింటిగ్’ షార్ట్ ఫిలిమ్స్ వంటి వాటిలో కూడా నటించాడు. వెండితెర నుంచి బుల్లితెర వైపు తన కెరీర్ సాగించిన యశ్వంత్.. కార్తీకదీపంలో మంచి ఫేమ్ సంపాదించాడు. బుల్లితెరపై హారో అవుదామని వచ్చిన అతడు మల్లీ వెండితెరపై అడుగుపెట్టబోతున్నాడు. తన అదృష్టం అక్కడ ప్రస్తుతం ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం అతడికి సంబంధించి ఫొటోలు వైరల్ గా మారాయి.






























