సాధారణంగా బుల్లితెరపై ప్రసారమయ్యే టీవీ సీరియల్స్ ద్వారా ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఎంట్రీ ఇస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన వారిలో బేబీ కృతిక ఒకరు. బేబీ కృతిక అంటే చాలామంది గుర్తు పట్టక పోవచ్చు కానీ… కార్తీక దీపం సౌర్య అంటే అందరికీ టక్కున గుర్తొస్తుంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో సౌర్య పాత్రలో నటిస్తున్నటువంటి కృతిక మంచి గుర్తింపు తెచ్చుకుంది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కార్తీకదీపం సీరియల్ ద్వారా పరిచయమైన తను ప్రస్తుతం ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కార్తీకదీపం సీరియల్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కార్తీకదీపం సీరియల్ లోని ప్రతి పాత్రకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక ఈ సీరియల్ లో చిన్న పిల్లల పాత్రలో నటిస్తున్నటువంటి సౌర్య, హిమ పాత్రలకి కూడా ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

ఇక కార్తీకదీపం సీరియల్ లో రౌడీ పిల్లగా పేరు సంపాదించుకున్న సౌర్య అలియాస్ కృతిక తన అల్లరితో, వివిధ రకాల ప్రశ్నలు వేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇలా బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బేబీ కృతిక వెండితెరపై పలు సినిమాలలో నటించింది.

కార్తీకదీపం సీరియల్ లో కి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నారి త్వరలోనే సీరియల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందనే సమాచారం వినబడుతోంది. ఇలా ఇంత చిన్న వయసులోనే కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నా కృతిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ.. నిత్యం తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా కృతిక ట్రెడిషనల్ లుక్ లో ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.


































