కార్తికదీపం : “మీ అందరినీ బజారుకీడుస్తా…” అంటూ దీపపై రెచ్చిపోయిన మోనిత !

0
689

స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గత ఎపిసోడ్ ప్రేక్షకులలో ఎంతో ఉత్కంఠతను నెలకొల్పింది. ఈ క్రమంలోనే నేడు1103 ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. మరి ఈరోజు సీరియల్ ఎలా జరిగింది ఈరోజు ఎపిసోడ్ లోని హైలెట్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం… హాస్పిటల్ లో కార్తీక్ కోసం క్యారేజ్ తీసుకువెళ్లిన మోనిత కార్తీక్ నన్ను పెళ్లి చేసుకో అంటూ నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పిచ్చి పట్టిన దానిలాగా మన పెళ్లి కోసం సూటు తెచ్చాను… ఉంగరం తెచ్చాను 25న మన పెళ్లి.. ఇప్పుడు పెళ్లి చేసుకోనంటావేంటి డార్లింగ్.. పెళ్లి చేసుకోనంటే ఎలా కోరుకుంటాను అంటూ బెదిరిస్తుంది. ఈ క్రమంలోనే కార్తీక్ నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పడంతో మోనిత పిచ్చిదాని లాగా ప్రవర్తిస్తుంది. ఈ క్రమంలోనే దీపను పట్టుకొని నీ భర్త అంటే నాకు పిచ్చి… అర్థం చేసుకోవే దీప..కావాలంటే నీ పిల్లల బాధ్యతలను నేనే తీసుకుంటాను అంటూ దీపను కుదిపేస్తోంది.

ఈ విధంగా మోనిత కార్తీక్ పై పిచ్చి ప్రేమను చూపిస్తూ.. పిచ్చి పట్టినదానిలా ప్రవర్తిస్తోంది. తన ప్రవర్తన చూసి భాగ్యం, ఆదిత్య, ఎంతో విస్తుపోతారు. ఈ క్రమంలో కార్తీక్ నిన్ను నేను ప్రేమించడం లేదు.. పెళ్లి చేసుకోను అని ఖరాఖండిగా చెప్పడంతో మోనిత షాక్ అవుతుంది. ఈ మాటలు విన్న మోనిత మరి నా గర్భం సంగతేంటి కార్తీక్? మరి నేను ఎలా ఉండిపోతాం అంటూ బెదిరించే ప్రయత్నం చేయడంతో షటప్ మోనిత అంటూ గట్టిగా అరుస్తాడు. ఒక పెళ్లైన వ్యక్తిని, ఇద్దరు పిల్లలు ఉన్న తండ్రిని ప్రేమించడమే కాకుండా… తన భార్య ముందు ఇలా అవమానిస్తావా? అని కార్తీక్ అనడంతో నేను నిన్ను ఇష్టపడుతున్నాను.. నువ్వు అవమానించావని పదేళ్లపాటు నీ భార్య నీకు దూరంగా ఉంది.కానీ మీరందరూ నన్ను ఎంత అవమానించిన, కొట్టినా, అసహ్యించుకున్న పదహారేళ్ల నుంచి నీకు దగ్గరగా ఉన్నా.. ఎవరి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు అంటూ కార్తీక్ ను నిలదీస్తుంది.

ఈ క్రమంలోనే మోనిత దీపతో మాట్లాడుతూ.. నువ్వైనా చెప్పమ్మా..నా తలరాతను మార్చమని చెప్పవే అంటూ బతిమాలాడుతుంది. నేనేమైనా మీ ఆస్తులు అడిగానా కార్తీక్.. కేవలం ఒక్క తాడు నా మెడలో వేయమని చెప్పాను అంతే కదా.. ఆ తాడు వేస్తే నీ భార్య నవ్వుతాను అంటూ ప్రాధేయపడుతోంది. అయినా ఒక తాడు మనల్ని శాసించడం ఏంటి అని మోనిత అడగడంతో దీప తాళికి ఉన్న విలువను చెబుతుంది. ఎంతో పవిత్రమైన ఇలాంటి తాళిని దానం చేయడానికి ఏ మహిళ ఒప్పుకోదు నీ ఉన్మాదం భరించేవారు ఎవరూ ఇక్కడ లేరు అంటూ దీప చెబుతూ కార్తీక్ ను అక్కడి నుంచి బయటకు వెళ్ళమని చెబుతుంది.

దీంతో కార్తీక్ బయటకు వెళ్లగానే మోనిత అందరిపై రెచ్చిపోయి మిమ్మల్ని బజారుకి ఈడుస్తాను… మీ పై దుమ్మెత్తి పోస్తాను అంటూ తిడుతూ అక్కడి నుంచి వెళ్తుంది. ఇక బాధతో బయట కూర్చుని ఆలోచిస్తున్న కార్తీక్ దగ్గరకు వెళ్లి భోజనం చేద్దాం రండి అని పిలుస్తుంది. ఆ సమయంలో కార్తీక్ మాట్లాడుతూ ఇలాంటి సమయంలో నాకు తోడుగా ఉండి నన్ను ఎంతో అర్థం చేసుకున్నావు.. నేను నిన్ను అర్థం చేసుకోలేక పోయాను అంటూ దీప రెండు చేతులు పట్టుకొని దండం పెడతాడు. ఆవేశంతో ఇంటికి వెళ్ళిన మోనిత ఆ తర్వాత ఏం చేస్తుందనే విషయాన్ని తర్వాత ఎపిసోడ్ లో చూడవచ్చు.