Premi-Viswanath: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ గురించి అందరికీ తెలిసిందే. దీప పాత్రలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షక అభిమానులను సంపాదించుకున్న ప్రేమి విశ్వనాథ్ ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ కు దూరమయ్యారు.

కార్తీకదీపం సీరియల్ తర్వాత జనరేషన్ కథ ప్రారంభం కావడంతో ప్రేమి విశ్వనాథ్ సీరియల్ నుంచి తప్పుకున్నారు.ఇలా కార్తీక దీపం నుంచి తప్పకున్న వంటలక్క ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనే విషయం గురించి ప్రతి ఒక్కరు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. కార్తీక దీపం నుంచి వెళ్లిపోయిన దీప ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకని వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాలలో దీపకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో ఉంచుకొని పలువురు దర్శక నిర్మాతలు ఈమెకు వెండితెరపై అవకాశాలను కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ ఇకపై వెండితెర ప్రేక్షకులను సందడి చేయనుంది.
కీలక పాత్రలో నటిస్తున్న దీప…
ఇప్పటికే బాలకృష్ణ తన 107 వ సినిమాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలో బాలకృష్ణకు చెల్లెలి పాత్రలో వంటలక్క నటించబోతుందన్న వార్త సోషల్ మీడియాలో పెద్దఎత్తున వినబడుతున్నాయి. ఇందులో బాలకృష్ణ చెల్లెలు పాత్ర ఎంతో కీలకంగా ఉండటం వల్లే దర్శకనిర్మాతలు ఈమెను సంప్రదించారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయాన్ని అధికారకంగా ప్రకటించాల్సి ఉంది.


































