Monitha: ఈ మధ్య తెలుగు సీరియల్ యాక్టర్లు కూడా హీరో, హీరోయిన్ల కన్నా ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు. ప్రతీ ఇంట్లో కూడా సీరియళ్లు లేకపోతే రోజు గడవడం లేదు. అంతగా అల్లుకుపోయాయి టెలివిజన్ సీరియళ్లు. ముఖ్యంగా కొన్ని సీరియళ్లను అయితే మిస్ కాకుండా ఆడ, మగ వీక్షిస్తున్నారంటే వాటి సత్తా ఏంటో తెలుస్తోంది.

సీరియళ్ల పాపులారిటీ లిస్ట్ తీస్తే అన్నింటి కన్నా ముందుగా వినిపించే పేరు ‘కార్తీక దీపం’. మా టీవీలో వచ్చే ఈ సీరియల్ రేటింగ్ ముందు రియాలిటీ షోలు కూడా వెనకబడుతున్నాయి. కార్తీక దీపం సీరియల్ టీఆర్పీ రేటింగ్ ముందు బిగ్ బాస్ వంటి షోలు కూడా నిలువలేకపోతున్నాయి.

ముఖ్యంగా ఈ సీరియల్లో నటిస్తున్న వారిలో కార్తిక్ రోల్ పోషిస్తున్ననిరుపమ్ పరిటాల ఆకట్టుకుంటుంటే.. అన్నింటి కన్నా ముఖ్యమైన దీప పాత్రలో ప్రేమి విశ్వనాథ్ నటిస్తోంది. ఈ సీరియల్ ప్రేమి విశ్వనాథ్ కు ఎనలేని పేరు తెచ్చింది. ఇదిలా ఉంటే పవర్ ఫుల్ అత్త పాత్రలో అర్చన అనంత్ నటిస్తోంది.
మోనిత క్యారెక్టర్ ఎంత పాపులరో తెలిసిందే..
ఈ క్యారెక్టర్లతో పాటు మోనిత క్యారెక్టర్ ఎంత పాపులరో తెలిసిందే. ఈ పాత్రలో నటిస్తోన్న భామ కన్నడ నటి శోభా శెట్టి. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తోంది. శోభా శెట్టి ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఆమె ఇన్ స్టా అకౌంట్ లో నాగిని డ్యాన్స్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. ఈ ఫిక్స్ ప్రస్తుతం నెట్ లో హల్చల్ చెస్తున్నాయి. హీరోయిన్లకు తీసిపోని విధంగా ఉన్న ఆమె అందం అందర్ని కట్టిపడేస్తోంది.































