Karthikeya 2: చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదలయ్యే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సినిమాలను సైతం పక్కకు నెట్టి ఈ సినిమా పెద్ద ఎత్తున కలెక్షన్లను రాబడుతుందని చెప్పాలి.

బాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం 5 థియేటర్లలో ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ల సంఖ్య 3 వేలకు పైగా పెరగడంతో ఈ సినిమాకి ఎలాంటి స్పందన లభించిందో అర్థమవుతుంది. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా,అక్షయ్ కుమార్ రక్షాబంధన్ సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలను వెనక్కినట్టే కార్తికేయ దూసుకుపోతుంది.
ఈ క్రమంలోనే గత వారం రోజులుగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సుమారు 60.12 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కృష్ణాష్టమిని అద్భుతంగా క్యాష్ చేసుకొని భారీ వసూలను రాబట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సాధారణ హీరోగా కొనసాగుతున్నటువంటి నిఖిల్ నటించిన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి సత్తా చాటడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

Karthikeya 2: నిఖిల్ కెరియర్ లోనే భారీ హిట్ సినిమా…
ఇది నిఖిల్ కెరియర్ లోనే అత్యధిక వసూలను సాధించిన సినిమాగా నిలిచిపోతుంది.ఇక ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఈ విధమైనటువంటి కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర బృందం సైతం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నిఖిల్ సినిమా తరచూ వాయిదా పడుతూ వచ్చినప్పటికీ చివరికి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుందనే చెప్పాలి.
































