స్టేజిపైనే కాబోయే భార్యకు ఎంత క్యూట్ గా ప్రపోజ్ చేసాడో చూడండి.. ఈ లవ్ స్టోరీ వెరీ ఇంట్రెస్టింగ్.!

0
325

ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాజా విక్రమార్క. ఈ సినిమాను శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నవంబర్ 12న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చిన దిల్ రాజు గారు, సుధీర్ బాబు గారు,శ్రీ విష్ణు అన్నయ్య , విశ్వక్ సేన్, కిరణ్ ప్రతి ఒక్కరికి థాంక్యూ అని తెలిపారు. రాజా విక్రమార్క సినిమా టైటిల్ చిరంజీవి గారిది. ఆయన ఖైదీ పెట్టుకునేది స్థాయి ఉందని అనుకోవడం లేదు అని తెలిపారు.చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమా ఏది చుసిన అందులో మనల్ని ఉహించుకుంటూ పెరిగాం అని తెలిపారు.

నా సినిమాలు అన్నింటిలో నేను సొంతంగా టైటిల్ పెట్టుకున్నది ఈ సినిమాకే అని చెప్పుకొచ్చాడు.ఈ సినిమా సక్సెస్ అవ్వడం నా మీద నాకు కాన్పిడెన్స్ ఇస్తుంది, అంత ఇంపార్టెంట్ సినిమా ఇది అని చెప్పుకొచ్చాడు.ఇక ఇదే ఈవెంట్ లో తనకు కాబోయే భార్యను కార్తీక్ పరిచయం చేసారు.తన ప్రేమకథ గురించి కార్తికేయ మాట్లాడుతూ నేనే ప్రపోజ్ చేశా. ఈ మెసేజ్ కోసం ఎదురు చూశా, గిఫ్ట్ లు కూడా ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు.

తాను లైఫ్ లో హీరోగా అవ్వడానికి పడినంత స్ట్రగుల్ పడ్డాను. అలా చివరికి ఆ అమ్మాయిని నవంబర్ 21న పెళ్లిచేసుకోబోతున్నాను. తన పేరు లోహిత. తను నా ఫ్రెండ్,గర్ల్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఇక నుంచి ఒకటే రోల్ వైఫ్ అని చెప్పారు. అనంతరం వేదికపై లోహితకు కార్తికేయ ప్రపోస్ కూడా చేశారు.