Karuna Bhushan: ప్రస్తుత కాలంలో సినిమా సెలబ్రిటీలతో పాటు సీరియల్ నటి నటులు కూడా బాగా పాపులర్ అవుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని సీరియల్ నటి నటులు మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఎలా పాపులర్ అయిన వారిలో బుల్లితెర నటి కరుణా భూషణ్ కూడా ఒకరు. యువ సీరియల్ ద్వారా నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కరుణా భూషణ్..శ్రావణ సమీరాలు సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది.

ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ లో నటించడమే కాకుండా సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం వైదేహి పరిణయం అని సీరియల్ లో విలన్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరుణ భూషణ్ తన వ్యక్తిగత విశేషాలతో పాటు కుటుంబ విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకుంది.
ఈ క్రమంలో తన కొడుకు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అయితే కరోనా భూషణ్ తన కొడుకు గురించి చెప్పిన మాటల వల్ల ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ ఇంటర్వ్యూలో కరుణ భూషణ్ మాట్లాడుతూ..” తన కొడుకు తాను మంచి స్నేహితులుగా ఉంటామని తెలిపింది. అంతే కాకుండా తన కొడుకు తన గ్లామర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తాడని తెలిపింది.

Karuna Bhushan: కొడుకుని పెంచే పద్ధతి అదేనా…
తాను ఏ దుస్తులు వేసుకున్నా బాగుంటే బాగుందని, లేదంటే లేదని తన మనసులో ఉన్న అభిప్రాయం నేరుగా చెప్పేస్తాడని, ఒకవేళ ఎప్పుడైనా కాస్త హాట్ డ్రస్ వేసుకుంటే.. సె*క్సీగా ఉన్నానని డైరెక్ట్ గా చెప్పేస్తాడని తెలిపింది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఫ్రెండ్లీ నేచర్ ఉండేలా ఏం జరిగినా కూడా పేరెంట్స్ తో పంచుకోవాలని తనకి చెప్పినట్లు కరుణాభూషణ్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పలువురు నెటిజెన్స్ కరుణా భూషణ్ మీద విమర్శలు కురిపిస్తున్నారు. పిల్లాడు తల్లిని పొగిడే పద్ధతి అదా, పిల్లాడిని ఎలా పెంచుతున్నారు అంటూ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
































