Kasthuri Shankar: 60 ఏళ్ల వ్యక్తితో ఎఫైర్ గురించి వస్తున్న వార్తలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంటింటి గృహలక్ష్మి కస్తూరి!

0
3727

Kasthuri Shankar: కస్తూరి శంకర్ అంటే ఎవరు గుర్తుపట్టలేక పోవచ్చు కానీ తులసి అంటే మాత్రం టక్కున గుర్తుపడతారు. ఎన్నో సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందిన కస్తూరి ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో తులసి పాత్రలో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ రాని గుర్తింపు ఈ సీరియల్ ద్వారా కస్తూరికి లభించింది. సీరియల్ లో కట్టు బొట్టుతో ఎంతో సంప్రదాయంగా కనిపించే కస్తూరి బయట మాత్రం స్కిన్ షో చేస్తూ 48 ఏళ్ల వయసులో కూడా ఎంతో హాట్ గా కనిపిస్తోంది. ఇలా ఈ వయసులో కూడా కస్తూరి ఇచ్చే గ్లామర్ ట్రీట్ చూసి ఈమె గురించి ఎన్నో విమర్శలు వినిపిస్తున్నాయి.

గత కొంతకాలంగా కస్తూరి ఎఫైర్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తల గురించి స్పందించిన కస్తూరి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. గత కొంతకాలంగా కస్తూరి 60 ఏళ్ల వయసున్న ఒక బిజినెస్ మాన్ తో సహజీవనం చేస్తూ అతనితో కలిసి విదేశాలలో వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Kasthuri Shankar: ఆ వార్తలు ఎంతో బాధ కలిగించాయి..

ఇటీవల ఈ వార్తలపై స్పందించిన కస్తూరి మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో నటీనటులపై ఇలాంటి రూమర్స్ రావడం చాలా సహజం. కానీ ఇప్పుడు నా గురించి వస్తున్న ఈ వార్తలు వింటుంటే ఎంతో బాధగా ఉందని చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కస్తూరి సీరియల్స్ లో మాత్రమే కాకుండా సినిమాలలో కూడా ప్రధాన పాత్రలలో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ లో జోరుగా ముందుకు దూసుకుపోతోంది.