Kasturi Shankar: ఏ యాంగిల్ లో చూసిన అలానే కనిపిస్తున్నావ్.. కస్తూరి పై షాపింగ్ కామెంట్స్ చేసిన ఓంకార్..?

0
22

Kasturi Shankar: సీనియర్ నటి కస్తూరి అనగానే చాలామందికి తెలియకపోవచ్చు.. కానీ గృహలక్ష్మి సీరియల్లో తులసి అంటే మాత్రం టక్కున గుర్తుపడతారు. ఈ సీరియల్లో తులసి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన కస్తూరి సీరియల్ లో నటించడానికి ముందు వెండితెరపై హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. తెలుగు తమిళ్ భాషలలో ఎందరో స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించిన కస్తూరి ఆ తరువాత వివాహం చేసుకొని కొంతకాలం సినిమాలకు దూరమైంది.

ఇక ఇటీవల ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ లలోను సీరియల్స్ లోను నటిస్తూ ఆకట్టుకుంటుంది. గృహలక్ష్మి సీరియల్లో తులసిగా లీడ్ రోల్ లో నటిస్తున్న కస్తూరి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా బుల్లి పేరు మీద ప్రసారమవుతున్న టీవీ షోలలో కూడా సందడి చేస్తూ ఉంటుంది . తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న తులసి గురించి యాంకర్ ఓంకార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సిక్త్ సెన్స్ సీజన్ 5 లో ఇటీవల పాల్గొనింది. ఇక ఈ షో లో ఎంట్రీ ఇవ్వగానే కస్తూరీ.. వేరీ ఈజ్ ద పార్టీ అంటూ వాల్తేరు వీరయ్యలోని పాటకు అదిరిపోయే స్టెప్స్ వేసింది. ఇది చూసిన యాంకర్ ఓంకార్.. ‘కస్తూరి ఓ సారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి.. ఏ యాంగిల్ నుండి చూసినా మదర్ లా కనిపించడం లేదు. మరదలిలా కనిపిస్తున్నారు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Kasturi Shankar: మదర్ గా అసలు లేరు…


అయితే 49 ఏళ్ల వయసు ఉన్న తన అందం గురించి ఓంకార్ అల కాంప్లిమెంట్స్ ఇవ్వటంతో కస్తూరీ ఒక్కసారికి సిగ్గు పడుతు మెలికలు తిరిగింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబందించిన వీడియో వైరల్ గా మారింది.ఇక ఈమెతోపాటు బుల్లితెర నటినట్లు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ గా మారింది