ఫిలిమ్ క్రిటిక్, నటుడు, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే కత్తి మహేష్ మరణం వెనుక ఏదో మిస్టరీ దాగి ఉందని ఆయన మరణం పై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేష్ కు యాక్సిడెంట్ జరిగిన తీరు ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించిన విధానాన్ని గమనిస్తే ఆయన మరణం పై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కత్తి మహేష్ తండ్రి, ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ కత్తి మహేష్ మరణం పై సమగ్ర విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన అధికారులు ఆక్సిడెంట్ అయిన సమయంలో కత్తి మహేష్ పక్కన ఉన్నటువంటి కార్ డ్రైవర్ ను విచారణ చేపట్టింది.

ఈ విచారణలో భాగంగా ఎన్నో విషయాలు బయటపడ్డాయి. కత్తి మహేష్ కారు నడిపింది డ్రైవర్ కాదని, అతను మహేష్ స్నేహితుడు, బిజినెస్ పార్ట్నర్ సురేష్ అని తేలింది.అయితే సురేష్, మహేష్ ఇద్దరు ఆ రోజు రాత్రి చిత్తూరుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ అసలు విషయాలను బయట పెట్టాడు.
మహేష్ నేను మైనింగ్ వ్యాపారం చేయాలని భావించాము. అయితే ఆ పని నిమిత్తం చిత్తూరుకు వెళ్లాల్సి రావడంతో ఇద్దరం కలిసి చిత్తూరుకు బయలుదేరాము.చిత్తూరు జిల్లా ఉదయమాణిక్యం విలేజ్.. యర్రావారి పాలెం మండలంలో మైనింగ్ చేద్దాం అని భావించాము.మైనింగ్ మొత్తం చెరో 12.5 ఎకరాల్లో మైనింగ్ చేద్దాం అని అనుకున్నాం. ఇందుకోసమే ఎన్ఓసీ రావాల్సి ఉంది.. అది ఇనిషియల్ స్టేజ్‌లో ఉంది. MRO ఆఫీస్ నుంచి ఎన్ఓసీ కోసం ఆరోజు మేం బయలుదేరాం.
ఈ విధంగా వెళుతున్న సమయంలోనే యాక్సిడెంట్ కి గురైంది కానీ ఎలాంటి విభేదాలు కానీ ఆయన మరణం వెనుక ఎలాంటి రహస్యాలు లేవని సురేష్ తెలిపారు. కారు యాక్సిడెంట్ అయ్యే సమయానికి డ్రైవింగ్ నేనే చేస్తున్న. సీట్ బెల్ట్ పెట్టుకొమ్మాని మహేష్ కి చెప్పినప్పటికీ అన్న పెట్టుకోలేదు. యాక్సిడెంట్ కాగానే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో నేను చిన్న గాయాలతో బయటపడ్డాను. మహేష్ అన్నను కూడా నేనే కారులో నుంచి దింపి హాస్పిటల్ కి వెళ్దాం అన్నా అంటే అతను మాట్లాడాడు.ఇక చెన్నై ఆసుపత్రికి తరలించే వరకు నేనే వెంటే ఉన్నా అతని ఆరోగ్యం కుదుటపడుతుంది మాతో మాట్లాడుతున్నాడు ఇంకా డిశ్చార్జి అవుతారనుకున్న సమయంలో ఈ విధంగా చనిపోయాడనే వార్త తెలియడంతో ఎంతో షాకయ్యానని సురేష్ అసలు విషయాన్ని బయటపెట్టారు.