Kaushal: ఆస్పత్రి పాలైన బిగ్ బాస్ కౌశల్ తండ్రి… ఎమోషనల్ అయిన కౌశల్!

0
28

Kaushal: పలు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నటువంటి కౌశల్ బిగ్ బాస్ ద్వారా మరింత సక్సెస్ అందుకున్నారు ఈయన బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా నిలిచి ఎంతో మంచి ఆదరణ పొందారు. ఇదిలా ఉండగా తాజాగా నటుడు కౌశల్ తండ్రి సుందరయ్య అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారని తెలుస్తోంది.

సుందరయ్య కూడా పలు సీరియల్స్ లో నటుడిగా నటించారు అయితే ఈయనకు వయసు పై పడటంతో అనారోగ్య సమస్యలు బారిన పడ్డారని దీంతో ఈయనని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని నటుడు కౌశల్ సోషల్ మీడియా వేదికగా ఆసుపత్రిలో తన తండ్రికి సేవలు చేస్తున్నటువంటి ఒక వీడియోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

మీ అమ్మానాన్నలు మీతో ఎలా ప్రవర్తించారో అంతకంటే మెరుగ్గా వారితో మీరు వ్యవహరించండి. ఇతరుల కన్నా మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి మీ అందరి ప్రార్థనలలో మా నాన్నను ఉంచుతున్నాను. ఈయన క్షేమంగా కోలుకొని మీ దీవెనలతో త్వరగా ఆస్పత్రి నుంచి బయటకు వస్తారని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఎమోషనల్ అవుతూ షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Kaushal: నాన్నకు ప్రేమతో…


ఈ విధంగా తన తండ్రిపై ఉన్నటువంటి ప్రేమను అక్షర రూపంలో తెలియజేస్తూ తన తండ్రికి సేవలు చేస్తున్నటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నటువంటి కౌశల్ తన తండ్రికి ఏం జరిగింది అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు అయితే ఈ వీడియో చూసినటువంటి అభిమానులు మాత్రం కౌశల్ తండ్రి గారు క్షేమంగా బయటకు రావాలని ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.