ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె, తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమములను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కవిత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. సీఎం కెసిఆర్ కుమార్తె కవితను మంత్రిగా అయన కేబినెట్ లోకి తీసుకోనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ కు డెప్యూటీ సీఎం పదవి కట్టబెట్టేందుకు పనులు చక చకా చేసుకుపోతున్నారని కూడా గులాబీ దళంలో ప్రచారం జోరందుకుంది. ముందుగా రాజ్యసభకు పంపాలని యోచించినా రాష్ట్ర రాజకీయాల్లో కవిత కీలక పాత్ర పోషిచాలని భావిస్తున్నారట. అందుకోసమే ఆమె రాజ్యసభకు వెళ్ళడానికి సిద్ధంగా లేరని తేల్చిచెప్పినట్టు తెలుస్తుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేశారు కల్వకుంట్ల కవిత. అయితే అప్పుడు జరిగిన పరిణామాలుతో ఆ లోక్ సభ స్థానం వార్తల్లో నిలిచింది. పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర డిమాండ్ చేస్తూ 236 మంది రైతులు కవితకు వ్యతిరేకంగా నామినేషన్లను వేశారు. ఆసమయంలో నిజామాబాద్ లోక్ సభ స్థానం దేశ ప్రజలందరికి దృష్టినిఆకర్షించింది. ముందు వరకు పొలిటికల్ గా మంచి యాక్టివ్ గా ఉన్న కవిత. నిజామాబాద్ ఓటమి తరువాత కాస్త సైలెంట్ గా ఉన్నారు. టీఆరెస్ లో మంచి వాక్చాతుర్యం ఉన్న నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నేత కల్వకుంట్ల కవిత. గతంలో తనదైన శైలిలో చురుకుగా పార్లమెంట్ లో తెలంగాణ తరుపున తన గళాన్ని వినిపించిన కవిత నిజామాబాద్ ఓటమి తర్వాత ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. అందుకే గత ఏడాదినుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

అయితే కవితను మళ్ళి పొలిటికల్ గా యాక్టివ్ చేసేందుకు కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ మధ్య లో కవితను రాజ్యసభకు పంపాలని యోచించినా.. కవిత రాజ్యసభకు వెళ్లేందుకు ఇష్టం లేదని, ఆ అఫర్ ను తిరస్కరించినట్టు ప్రచారం జరుగుతుంది. ఆమె రాష్ట్ర రాజకీయాలలో కీలక భూమిక పోషించే యోచనలో ఆమె ఉన్నారని కవిత సన్నిహితులు, అనుచరులు చెబుతున్న మాట. అందుకే తెలంగాణ మంత్రిగా ఆమె పగ్గాలు చేపట్టనున్నారని గులాబీ వర్గాలలో వినిపిస్తున్న మాట. అయితే మంత్రిగా అయితే వస్తారు కానీ ఎలా వస్తారు ఎమ్మెల్సీగా క్యాబినెట్ లోకి వస్తారా? లేక వేరే ఎక్కడైనా ఉపఎన్నికల ద్వారా పోటీ చేపించి తీసుకువస్తారా అనేది ప్రస్తుతానికి తెలియదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here