జటప్రోలు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ప్రతిపక్షంలో కూర్చోవాలని ఆయన సవాల్ విసిరారు.

“ప్రజాపాలన చూసి కుమిలికుమిలి ఏడవాలి”
జటప్రోలులో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పెద్ద ఎత్తున హాజరైన జనానికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాన్ని చూసి కేసీఆర్ కుమిలికుమిలి ఏడవాలి” అని వ్యాఖ్యానించారు.
“మరో పదేళ్లు ఈ పాలమూరు బిడ్డ అధికారంలో ఉంటాడు”
“మరో పదేళ్లు ఈ పాలమూరు బిడ్డ అధికారంలో ఉంటాడు. ఈ మాట నీ గుండెల్లో రాసుకో కేసీఆర్!” అని రేవంత్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు. కేసీఆర్ కళ్ల ముందే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


































