Keerthi Suresh: ప్రభాస్ హీరోగా ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కల్కి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో కూడా భారీ స్థాయిలో విజయం అందుకొని సుమారు 1100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మైథాలజీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఎంతోమంది సెలబ్రిటీలు బాగమయ్యారు. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి మహానటి సినిమా ద్వారా కీర్తి సురేష్ తో మంచి పరిచయమున్న నేపథ్యంలో ఈ సినిమాలో ఓ పాత్ర కోసం కీర్తి సురేష్ ను సంప్రదించి అవకాశం కల్పించగా ఆమె మాత్రం చాలా సున్నితంగా ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.
కీర్తి సురేష్ నటించిన రఘు తాత అనే సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ విషయాన్ని కీర్తి సురేష్ వెల్లడించారు. కల్కి సినిమాలో నాకు అవకాశం కల్పించిన ఆ పాత్ర నేను చేయలేనని సున్నితంగా రిజెక్ట్ చేశానని తెలిపారు. ఇలా రిజెక్ట్ చేయడంతో తర్వాత బుజ్జి కారుకు వాయిస్ ఓవర్ ఇవ్వాలని చెప్పారు.

రఘు తాత..
ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వమంటే వెంటనే ఓకే చెప్పాను బుజ్జి కారుకు వాయిస్ ఓవర్ ఇచ్చే విషయంలో డైరెక్టర్ చాలా హెల్ప్ చేశారని కీర్తి సురేష్ వెల్లడించారు. ఇకపోతే ఈమెకు కల్కి సినిమాలో అవకాశం కల్పించారని వెల్లడించారు కానీ ఏ పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు అనే విషయాన్ని మాత్రం కీర్తి సురేష్ తెలియజేయకపోవడం గమనార్హం.



























