Keerthi Suresh: మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం తన తమిళ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను తెలుగులో కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మెగాస్టార్ చిరంజీవి గురించి పొరపాటున నోరు జారడంతో భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెకు యాంకర్ వివిధ రకాల ప్రశ్నలు వేశారు. హీరో ధనుష్ నాని ఇద్దరిలో బెస్ట్ డాన్సర్ ఎవరు అని ప్రశ్నించారు వెంటనే కీర్తి సురేష్ ధనుష్ అంటూ సమాధానం చెప్పారు. ధనుష్ అల్లు అర్జున్ వీరిలో బెస్ట్ డాన్సర్ ఎవరు అనగా అల్లు అర్జున్ అని తెలిపారు. అల్లు అర్జున్ మహేష్ బాబు అని ప్రశ్న వేయగా అల్లు అర్జున్ బెస్ట్ డాన్సర్ అని వెల్లడించారు.

విజయ్ దళపతి..
అల్లు అర్జున్ చిరంజీవి ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అని చెప్పడంతో చిరంజీవి బెస్ట్ డాన్సర్ అని వెల్లడించారు. ఇక చిరంజీవి విజయ్ దళపతి ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అని ప్రశ్నించడంతో దళపతి విజయ్ బెస్ట్ డాన్సర్ అంటూ ఈమె సమాధానం చెప్పారు. దీంతో ఏంటి చిరంజీవి కంటే విజయ్ అంత బాగా డాన్స్ చేస్తారా అంటూ చిరు ఫ్యాన్స్ ఈమెపై ట్రోల్స్ మొదలుపెట్టారు. మొత్తానికి కీర్తి సురేష్ నోరు జారడంతో భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.































