Keerthy Suresh: కీర్తి సురేష్ పరిచయం అవసరం లేని పేరు సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ తెలుగు చిత్ర పరిశ్రమకు నేను శైలజ అనే సినిమా ద్వారా పరిచయమయ్యారు. అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ ఈమె ఎప్పటికప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇకపోతే కీర్తి సురేష్ నటించిన గత నాలుగైదు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో కీర్తి సురేష్ పని అయిపోయింది అంటూ కామెంట్లు వినిపించాయి. ఇలా వరుస ఫ్లాప్ సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమెను దసరా సినిమా కాపాడిందని తెలుస్తుంది. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో కీర్తి సురేష్ ఎంతో అద్భుతంగా నటించారు.
ఈ సినిమాలో వెన్నెల పాత్రలో నటించిన కీర్తి సురేష్ ఈ పాత్రకు ప్రాణం పోసారని చెప్పాలి. ఇక దసరా సినిమాలో ఈమె పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉండడంతో కీర్తి సురేష్ పాత్రకు మరింత పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఇలా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ అద్భుతమైన నటనను కనబరిచిందని పెద్ద ఎత్తున ప్రశంసలు అందుతున్నాయి.ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ అవడంతో కీర్తి సురేష్ వరుస ఫ్లాప్ సినిమాల నుంచి బయటపడిందని తెలుస్తోంది.

Keerthy Suresh:సక్సెస్ ట్రాక్ లో పడిన కీర్తి సురేష్…
ఇలా గత కొంతకాలంగా ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటున్న కీర్తి సురేష్ కు దసరా సినిమా కాస్త ఉపశమనం కలిగించిందని చెప్పాలి. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ అవడంతో ఈమెకు మరిన్ని అవకాశాలు రాబోతున్నాయి. ఇక తాజాగా ఈమె చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కనుక సక్సెస్ అయితే కీర్తి కెరియర్ సక్సెస్ ట్రాక్ లో ప్రయాణిస్తుందని చెప్పాలి.
































