వింత ఆచారం.. పెళ్లి కూతురుపై ఉమ్మి వేయడం అక్కడ సంప్రదాయం!

0
309

ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జాతులు కులాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు . అలాగే వారి వారి జాతులను బట్టి సాంప్రదాయాలు కూడా అ వేరుగా ఉంటున్నాయి. ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. కానీ కొన్ని కొన్ని అంటే ఆచారాలు వింటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటివి కూడా ఆచారాలుగా పాటిస్తారా? అన్న అనుమానం కలుగుతుంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఒక్కో ప్రాంతం వారు ఒక్కో సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు.

పెళ్లి అనేది జీవితంలో జరిగే ఎంతో అపురూపమైన ఘట్టం. అలాంటి వివాహం తర్వాత భార్యభర్తలిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండాలని, ఎటువంటి కష్టసుఖాలు వచ్చిన వాటిని ఎదుర్కొనే ధైర్యంగా నిలబడాలనే ఉద్దేశంతో ఇటువంటి సాంప్రదాయాలను పాటించి వివాహం జరిపిస్తారు. ఇప్పటి వరకు కొన్ని ఆచారాల్లో భాగంగా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు లను చీపురు కట్ట పై దాటించడం, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు లతో వింత వింత పనులను చేస్తూ వారి ఆచారాలుగా భావిస్తున్నారు. ఇలాంటి తరహాలోనే మరొక వింత ఆచారం తాజాగా బయటపడింది. ఆ వింత ఆచారం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

ఆఫ్రికా దేశాల్లోని కెన్యా దేశం ఎంతో వెనుకబడిన దేశం. ఎంతో వెనుకబడిన దేశం అయినప్పటికీ కూడా అక్కడి ప్రజలు వారి సంస్కృతి సాంప్రదాయాలను మాత్రం పూర్వం నుంచి ఇప్పటివరకు పాటిస్తున్నారు. ఆ వింత సాంప్రదాయం ఏమిటంటే పెళ్లి కూతురు తలపై ఉమ్మివేయడం అక్కడ ఆచారంగా పాటిస్తున్నారు. కెన్యాలోని మస్సాయ్ అనే తెగకు చెందినవారు పెళ్లిళ్ల ను కొంచెం భిన్నంగా నిర్వహిస్తారు.

పెళ్లి సమయంలో వధూవరులను ఆశీర్వదించాలంటే కాస్త అక్షింతలు తలపై వేసి ఆశీర్వదిస్తారు. కానీ ఇక్కడ మాత్రం వధువు తండ్రి పెళ్లికూతురు తలపై ఉమ్మి వేస్తాడు, తరువాత ఆమె ఎద పై కూడా ఉమ్మి వేస్తాడు. ఇలా వేయడం వల్ల తన కూతురు దాంపత్య జీవితం ఎంతో సుఖంగా ఉంటుందని వారు భావిస్తారు.తన తండ్రి ఈ కార్యక్రమం నిర్వహించిన తర్వాత పెళ్లికి వచ్చిన బంధువులు అందరూ పెళ్లికూతురు తలపై ఉమ్మి వేసి ఆశీర్వదిస్తారు. అలా ఆశీర్వదించడం వల్ల వారికి మంచి జరుగుతుందని వారి నమ్మకం.