KGF 2 Villan Garuda story : కేజీఎఫ్ సినిమా విడుదలయినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ చిత్రంలో నటించిన నటి నటులకు గుర్తింపుతో పాటు మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది సినిమా. ఇక ఈ సినిమాలో నటించిన ఒక్కొక్కరి గురించి వారి బ్యాక్ గ్రౌండ్ గురించి ఆరాలు తీయడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఇటీవలే కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్సుర్ జీవితం గురించి తెలిసి అందరూ షాక్ అయ్యారు. ఇక డైరెక్టర్ ప్రశాంత్ ది మరో వింత స్టోరీ అసలు దర్శకుడు అవ్వాలని అనుకొని ప్రశాంత్ దర్శకుడాయ్యడు.ఇక యష్ సీరియల్స్ తో మొదలై సినిమా హీరోగా వచ్చి ఇపుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు.ఇక సినిమా కు ఎడిటర్ గా పనిచేసిన ఉజ్వల్ కులకర్ణి 19ఏళ్ల కుర్రాడు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కథ.

ఇక కేజీఎఫ్ లో విలన్స్ అనగానే గుర్తొచ్చే పాత్ర గరుడ. ఆహార్యంతోనే భయం కలిగించిన గరుడ జీవితం గురించి తెలిస్తే ఇంకా షాక్ అవ్వకమానరు.గరుడగా నటించిన రామ్ యష్ కి డ్రైవర్ గా పనిచేసేవాడు. 12 ఏళ్లుగా యష్ కు కార్ డ్రైవర్ గా ఉన్న రామచంద్రరాజు ను కథ చర్చల కోసం యష్ ను కలిసిన ప్రశాంత్ సినిమాలో నటింపజేయాలనీ అనుకున్నారు. గడ్డం పెంచుకుని కనిపించమన్నారు. ఇక ప్రశాంత్ నీల్ భరోసా ఇవ్వడంతో బాడీ బిల్డింగ్ పైన శ్రద్ధ పెట్టాడు.

ఇక నటనా అనుభవం లేని రామచంద్ర రాజు తో ఎలా నటింపజేస్తాడో అని యష్ కు అనుమానాలు ఉండేవట. అయితే తాను అవన్నీ చూసుకుంటా అని చెప్పి ప్రశాంత్ భరోసా ఇచ్చి రామ్ తో కేజీఎఫ్ లో విలన్ పాత్ర అయిన గరుడకు ఫిక్స్ అయ్యాడు. నీకు ఇకపై ఇక బాడీ గార్డ్, డ్రైవర్ ఉండడని చెప్పేసాడట యష్ తో ప్రశాంత్ నీల్. ఇక గరుడగా రామ్ నటన అందరిని ఆకట్టుకుంది మరియు అతడిని పాన్ ఇండియా స్టార్ ను చేసింది. యష్ కి ఉన్నంత క్రేజ్ తనకు లేకపోయినా రామ్ కూడా మంచి అవకాశాలను అందుకుంటున్నాడు. ఇక పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఆల్రెడీ మహా సముద్రం సినిమా చేసాడు రామచంద్రరాజు. ఎలా ఒక డ్రైవర్ ఇపుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి అందరికి ఇన్స్పిరేషన్ అయ్యాడు.
































