KGF Actor: ప్రపంచవ్యాప్తంగా సంచలనాలను సృష్టించిన కే జి ఎఫ్ సినిమా ద్వారా ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపు పొందారు.ఈ సినిమా మంచి విజయం కావడంతో సినిమాలో నటించిన సెలబ్రిటీలు మాత్రమే కాకుండా ఈ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్లకు కూడా మంచి పేరు వచ్చింది.ఇలా ఈ సినిమాలో అందుడు పాత్రలో నటించిన తాత పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పాలి.

ఇలా ఈ సినిమాలో అందుడు పాత్రలో నటించిన తాత అసలు పేరు కృష్ణ జీ రావు. ఈ సినిమా ద్వారా ఈయనకు ఎంతో మంచి గుర్తింపు రావడంతో వరుస సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి కృష్ణ జీ రావు ఆరోగ్య పరిస్థితి కూడా ప్రమాదకరంగా మారింది.
గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తనని కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం బెంగుళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు.అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడం చేత వైద్యులు తనని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

KGF Actor:నటనపై ఆసక్తితో 30 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన నటుడు…
ఇలా ఈయన ఆసుపత్రిలో ఉన్నారని తెలియగానే ఎంతోమంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ తన క్షేమంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. నటనపై ఆసక్తితో కృష్ణాజి రావు 30 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టైలర్, అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ మేనేజర్ ఇలా చాలా పనులు చేశారు. అలాగే కథ రచయితగా కూడా ఈయన ఇండస్ట్రీలో కొనసాగారు.






























