Khushbu Sundhar : సీనియర్ నటి ఖుష్బు సుందర్ అటు తమిళం, ఇటు తెలుగు సినిమాలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి. 1986 లో వెంకటేష్ హీరోగా వచ్చిన ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోయిన్ గా మొదలైన కెరీర్ ఏకంగా ఆమె కోసం తమిళ నాట గుడి కట్టే స్థాయికి వెళ్ళింది. అంతలా ఆమెను ఆరాధించారు తమిళ ప్రజలు. తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించిన ఖుష్బు సినిమా అవకాశాలు కొద్దిగా తగ్గుతున్న సమయంలో దర్శకుడు నటుడు, నిర్మాత అయిన సుందర్ ను పెళ్లి చేసుకున్నారు.

నాపై ఎన్నో ట్రోల్స్ అందుకే ఇంటికి పరిమితం…
ఇక ఖుష్బు సుందర్ కి ఇద్దరు కుమార్తెలు ఒకరు అవంతిక, ఇంకొకరు ఆనందిత. అవంతిక సంగతి పక్కన పెడితే ఆనందిత కు సినిమాలపై ఇంట్రస్ట్ ఉంది. అయితే చాలా లావుగా ఉన్న ఆనందిత ఇప్పుడు సన్నబడి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఒకప్పుడు చాలా లావుగా ఉన్న ఆనందిత బాగా బాడీ షేమింగ్ కి గురైందట. తన తల్లితో ఆమెను పోలుస్తూ నెగెటివ్ కామెంట్స్ పెట్టేవారట. తన తల్లి చాలా అందంగా ఉంటుంది కానీ తను అలా కాదు, అందుకే నెగెటివ్ కామెంట్స్ తట్టుకోలేక ఇంటికే పరిమితమై బయట కనిపించకుండా కనుమరుగయిందట.

అయితే తన బాడీ వెయిట్ తగ్గించుకుని మళ్ళీ అందరి ముందుకు వచ్చింది 17 ఏళ్ల ఆనందిత. అయితే ఇప్పడు కూడా నెగెటివ్ కామెంట్స్ తగ్గడం లేదట. లావు తగ్గడానికి సర్జరీలు చేయించుకున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 17 ఏళ్ల వయసులో ఎవరైనా సర్జరీలు చేయూంచుకుంటారా అంటూ తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో ప్రశ్నించింది. ఇక ఈ అమ్మడు సినిమాల్లోకి రంగ ప్రవేశం చేయడానికి సిద్దమైంది.































