ఈ మధ్య కాలంలో పలు దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. నెదర్లాండ్స్‌ ప్రభుత్వం తాజాగా వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఆ దేశం తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డచ్‌ ప్రభుత్వం తీవ్రమైన వ్యాధుల బారిన పడి కోలుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉన్న ఒకటి నుంచి 12 సంవత్సరాల పిల్లలను నిర్ధాక్షిణ్యంగా చంపేయాలని వైద్యులను ఆదేశించింది.

పిల్లలను చంపేందుకు చట్టాన్ని రూపొందించి డచ్ ప్రభుత్వం వార్తల్లో నిలిచింది. ఈ కొత్త చట్టం గురించి వైద్య నిపుణుల గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే పిల్లల ప్రాణాలు తీయడానికి వైద్యులు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు ఈ చట్టానికి మద్దతు పలుకుతుంటే మరి కొందరు మాత్రం ఈ చట్టంపై విమర్శలు చేస్తున్నారు. డచ్ ఆరోగ్య మంత్రి హ్యూగో డీ జోంగ్ ఈ చట్టం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

కొందరు పిల్లలు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని.. అలాంటి పిల్లలకు వైద్య చికిత్స అందించినా ఫలితం ఉండదని.. వాళ్ల అనవసరంగా బాధను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పలు దేశాల్లో ఇలాంటి చట్టాలు అమలులో ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఈ చట్టాన్ని పెద్దలకు పరిమితం చేయగా కొన్ని దేశాల్లో మాత్రం పిల్లలకు పరిమితం చేశారు. అమెరికాలోని న్యూయార్క్ లాంగన్ మెడికల్ సెంటర్ ప్రొఫెసర్ ఆర్థర్ కప్లాన్ ఈ చట్టం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

చిన్న దేశాలకు ఈ చట్టం వల్ల ప్రయోజనం చేకూరినా పెద్ద దేశాలకు మాత్రం ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. ఈ చట్టం అమెరికా లాంటి దేశాలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here