Kirak RP: కిరాక్ ఆర్పీ ఇటీవల కాలంలో సంచలనంగా మారారు. ఈయన కూటమికి మద్దతు తెలియజేయడమే కాకుండా వైఎస్ఆర్సిపి అభిమానుల పైన అలాగే నేతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచారు. ఇక ఇటీవల కాలంలో అల్లు అర్జున్ పై కూడా ఈయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

అల్లు అర్జున్ కేవలం తన స్నేహితుడు శిల్పా రవికి మద్దతుగా తెలియజేయడమే ఈయన చేసిన పొరపాటుగా ఆర్పీ మాట్లాడటమే కాకుండా వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపిన బన్నీ తన స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లి మద్దతు తెలియజేశారు.
ఇక ఈయన మద్దతు తెలిపిన వ్యక్తి ఓడిపోగా పవన్ కళ్యాణ్ గెలిచారు. దీంతో ఆర్పీ తరచూ సోషల్ మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అసలు నువ్వు సమాజం కోసం ఏం ఫైట్ చేసావని నీకు ఆర్మీ ఉంది. నువ్వు సినిమాలు చేసుకొని పాన్ ఇండియా స్టార్ అవ్వు అంతేకానీ నీకు ఆర్మీ ఎందుకు అంటూ మండిపడ్డారు.
నాగబాబు హస్తం ఉందా..
నువ్వు అల్లు అర్జున్ అయితే నేను ఆర్పీ అంటూ రెచ్చిపోయారు అయితే ఈయన ఇలా మాట్లాడటం వెనుక నాగబాబు ప్రమేయం ఉందని ఆయన కారణంగానే ఆర్పీ రెచ్చిపోయి మాట్లాడుతున్నారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే గతంలో బన్నీ గురించి నాగబాబు కామెంట్స్ చేస్తూ శత్రువుకి సపోర్ట్ చేసేవాడు మా వాడు అయినా పరాయి వాడే అంటూ పోస్ట్ కూడా చేసిన సంగతి తెలిసిందే. దీంతో నాగబాబు ఇదంతా చేస్తున్నారని బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



























