Kiraak RP: కిరాక్ ఆర్పీ పరిచయం అవసరం లేని పేరు.జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన అనంతరం జబర్దస్త్ కార్యక్రమం నుంచి దూరమై బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు.ఈ క్రమంలోనే హైదరాబాదులో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ప్రారంభించారు. ఇక్కడ వివిధ రకాల చేపలు పులుసులను అందుబాటులోకి తీసుకురావడంతో పెద్ద ఎత్తున కస్టమర్లు ఆర్పీ రెస్టారెంట్ ముందు బార్లు తీరారు.

ఈ విధంగా కర్రీ పాయింట్ వద్ద భారీగా కస్టమర్లు గూమి కూడడంతో ట్రాఫిక్ జామ్ అయినా సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా రెస్టారెంట్ బిజినెస్ లో ఎంతో సక్సెస్ సాధించినటువంటి ఆర్పీ చేపల పులుసు గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి.
అందరూ అనుకున్నట్టుగా ఆర్పీ చేపల పులుసు ఏమంత టేస్టీగా లేదని కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు. అయితే తన రెస్టారెంట్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు రావడంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆర్పీ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే తన రెస్టారెంట్ పై కుట్ర జరుగుతోందని ఈయన ఆరోపించారు.

Kiraak RP: ఇదంతా పెయిడ్ బ్యాచ్ పనే…
నేను ఇదివరకు ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని స్వయంగా నాకు కిచెన్లో ఎలా చేపల పులుసు వండుతున్నారో చూపించాను.ఒకరు మా రెస్టారెంట్లో చేపలు పులుసు టేస్ట్ చేసి మరో పదిమందిని తీసుకువస్తున్నారంటే అక్కడ ఎంత క్వాలిటీగా రుచికరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే నా రెస్టారెంట్ గురించి ఇలా ఉద్దేశపూర్వకంగా చెడుగా ప్రచారం చేసే వారందరూ కూడా పెయిడ్ బ్యాచ్ అని, నేను నీతిగా నిజాయితీగా బిజినెస్ చేస్తున్నా నన్ను ఎవరు మోసం చేయలేరు.మీరు నన్ను ఎంత నెగిటివ్ చేస్తే నాకు అంత ప్రమోషన్ ఉంటుందని ఈ సందర్భంగా తన రెస్టారెంట్ గురించి జరుగుతున్న కుట్ర గురించి ఆర్పీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
































