Kiran Abbavaram: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతూ వరుస సినిమాలలో నటిస్తూ ఇంత బిజీగా గడుపుతున్న వారిలో నటుడు కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన హీరోగా ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్నారు. అయితే కిరణ్ అబ్బవరం గత కొద్ది రోజుల క్రితం నటి రహస్య గోఖర్ అని హీరోయిన్ తో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.

వీరిద్దరూ కలిసి రాజావారు రాణి వారు అనే సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా ద్వారా వీరిద్దరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడడం ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడం జరిగింది కానీ వీరి ప్రేమ విషయాన్ని ఎక్కడ బయట పెట్టకుండా రహస్యంగా ప్రేమ ప్రయాణం చేస్తూ వచ్చారు.
ఈయన సినిమా ప్రమోషన్లలో భాగంగా పొరపాటున తన ప్రేమ విషయం గురించి బయటపడటంతో ఈ విషయం అందరికీ తెలిసిందే .ఇలా తన ప్రేమ విషయం బయటపడిన కొద్ది రోజులకే కిరణ్ అబ్బవరం తన నిశ్చితార్థపు తేదీని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇలాంటి నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
పెళ్లికి వేళాయరా..
కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా తన పెళ్లి గురించి పరోక్షంగా తెలియజేశారు నటీ రహస్య ఆగస్టులోనే వీరి వివాహం ఉండబోతుందని తెలిపారు. అయితే తాజాగా వీరు పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయని ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. కిరణ్ అబ్బవరంతో కలిసి పూజ చేస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ఇట్స్ బిగిన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అలాగే సంగీత్ వేడుక కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని కూడా షేర్ చేయడంతో వీరి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. అయితే పెళ్లి ఎప్పుడు అనే తేదీ మాత్రం తెలియజేయలేదు.



























