Kirak RP: కిరాక్ ఆర్పీ పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కమెడియన్ గా ఉన్నటువంటి ఈయన ప్రస్తుతం చేపల పులుసు బిజినెస్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈయన రాజకీయ అంశాల గురించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. కూటమికి మద్దతు తెలుపుతూ అధికార పక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పై తీర్పు స్థాయిలో విమర్శలు కురిపించారు.

ఈయన చేసే విమర్శలు తారస్థాయికి చేరుకోవడంతో వైసిపి అభిమానులు తీవ్రస్థాయిలో అర్పీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వేణు స్వామి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నారు ఈయన చెప్పే జాతకాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియదు కానీ ఈయన పేరు మాత్రం భారీగా వినబడుతుంది.
ఇక ఇటీవల కాలంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలలో కానీ ఐపీఎల్ మ్యాచ్ విజయం విషయంలో కానీ ప్రభాస్ సినిమాల గురించి ఈయన చెప్పిన జాతకాలు నిజం కాకపోవడంతో ఆర్పీ వీటి గురించి ప్రశ్నిస్తూ వేణు స్వామి పై ట్రోల్ చేశారు. వేణు స్వామి చేత జగన్మోహన్ రెడ్డి సజ్జన రామకృష్ణారెడ్డి కావాలనే ఇలా తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని వెల్లడించారు.
నగ్నంగా పూజలు..
వేణు స్వామి బ్లాక్ మనీ ఉన్నవారికి మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తారని ఎద్దేవా చేశారు. ఇక వేణు స్వామి అమ్మాయిలతో పూజ చేసే సమయంలో వారి చేత నగ్నంగా పూజలు చేయిస్తారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి గురించి అర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి అర్పీ చేసిన ఈ వ్యాఖ్యలపై వేణు స్వామి స్పందన ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది.





























