Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా అప్పుడే ఒక ఏడాది పూర్తి చేసుకున్నారు. గత ఏడాది జూన్ 20 తేదీ మెగా ప్రిన్సెస్ జన్మించడంతో మెగా అభిమానులు కుటుంబ సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ చిన్నారి నేడు తన మొదటి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో ఉపాసన సోషల్ మీడియా వేదికగా తన కూతురి పుట్టిన రోజు గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో.. చరణ్, ఉపాసన ఇద్దరూ కూడా ఉపాసన ప్రగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి బేబీ పుట్టేంతవరకు ఎలా ఫీల్ అయ్యారో చెప్తూ ఎమోషనల్ అయ్యారు. తమని అందరూ పిల్లల గురించి అడిగేవాళ్ళని, పెళ్లయిన పదకొండేళ్ల తర్వాత పాప పుట్టడం అందరికి హ్యాపీగా ఉంది. తనని ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పుడు మర్చిపోలేనని, తను పుట్టినప్పుడు అభిమానులు అందరూ సెలబ్రేట్ చేసుకున్నారని చెబుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా క్లీన్ కార తన జీవితంలోకి రావడంతో తన జీవితం పరిపూర్ణమైంది అంటూ తన కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ చేశారు. ప్రస్తుత ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈ చిన్నారి జన్మించి ఏడాది అవుతున్న ఇప్పటివరకు తన ఫేస్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మాత్రం అభిమానులకు చూపించలేదు.
జీవితం పరిపూర్ణం..
ఈమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ ఎక్కడ తన ఫేస్ క్లియర్ గా కనిపించకుండా ఉపాసన జాగ్రత్త పడుతూ వచ్చారు.. అయితే ఈమె ఫేస్ కనిపించినప్పటికీ క్లియర్ గా కనిపించకపోవడంతో అభిమానులు మెగా ప్రిన్సెస్ ని ఎప్పుడు చూపిస్తారు అంటూ పోస్టులు కూడా పెడుతుంటారు. మరి తన పుట్టినరోజు సందర్భంగా నైనా క్లీన్ కారా ఫేస్ రివీల్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.



























