Klin kaara: క్లిన్ కారా పుట్టిన వేల విశేషం… 2 కోట్ల ఆస్తులను పొందిన చిరంజీవి?

0
41

Klin kaara: క్లిన్ కారా కొణిదెల మెగా మూడో తరం వారసురాలిగా మెగా కుటుంబంలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉపాసనల గారాల పట్టి క్లిన్ కారా జూన్ 20వ తేదీ జన్మించారు. ఇలా రాంచరణ్ దంపతులకు పెళ్లి అయిన 11 సంవత్సరాలకు చిన్నారి జన్మించడంతో అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇక చిన్నారి జన్మించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ చిన్నారి రాకతో మా ఇంట్లో సంతోషం వెల్లువిరిసిందని తెలిపారు. పాప అద్భుతమైన గడియలలో పుట్టిందని పండితులు చెబుతున్నారని చిరు తెలిపారు. అయితే కడుపులో ఉండగానే మా ఇంట్లో అన్ని శుభాలు జరుగుతున్నాయని చిరంజీవి తెలిపారు. అయితే చిరంజీవి చిన్నారి పట్ల చెప్పిన వ్యాఖ్యలు నిజమయ్యాయని తెలుస్తోంది.

చిన్నారి పుట్టిన వేల విశేషము ఏమో తెలియదు కానీ చిరంజీవికి ఏకంగా 2000 కోట్ల రూపాయల ఆస్తులు కలిసి వచ్చాయి.దీంతో చిరంజీవి మనవరాలు మహాజాతకురాలు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తన మనవరాలు జాతకం పై అందరూ చర్చలు జరుపుతున్నారు.మరి చిరంజీవికి ఉన్నఫలంగా ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిసి రావడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

Klin kaara: కోకాపేటలో భారీగా ఆస్తులు..


ప్రస్తుతం కోకాపేట భూములధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. దీంతో అక్కడున్నటువంటి వారందరూ కూడా కోటీశ్వరులుగా మారిపోయారు. ఇలా ఎకరం ఏకంగా 100 కోట్ల రూపాయల విలువ చేస్తుందని తెలుస్తోంది.అయితే కోకాపేట పరిసర ప్రాంతాలలో చిరంజీవికి ఏకంగా 30 ఎకరాల వరకు ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఈయన కూడా వేలకోట్ల రూపాయలను లాభ పొందారనిఅదంతా కూడా మెగా మనవరాలు ఇంట్లోకి వచ్చిన వేల విశేషమని తెలుస్తుంది.