ఇపుడు ఉన్న స్టార్ యాంకర్స్ లో విజయవంతంగా ముందుకు దూసుకెళ్తున్న వారిలో యాంకర్ శ్రీముఖి ఒకరు… అంతకు ముందు కొన్ని అడపాదడపా సినిమాలు చేసిన శ్రీముఖి అంటే ఎవరికి తెలిసేది కాదు.. అలా సినిమాలు చేస్తూనే పటాస్ షోలో యాంకరింగ్ చేసే అవకాశం వచ్చింది. పటాస్ షో శ్రీ ముఖిని స్టార్ యాంకర్స్ లో ఒకరిగా నిలబెట్టింది అని చెప్పొచ్చు.

ఆ తరువాత అన్ని ఛానెల్స్ లో షోలు చేస్తూ అందరికీ దగ్గరికి దగ్గర అయ్యింది. ఇక బిగ్ బాస్ షో లో పాల్గొని తన స్టార్ డంని మరింత పెంచుకుంది ఈ బ్యూటీ.. బిగ్ బాస్ లో చివరి వరకు గట్టి పోటీ ఇచ్చి రెండవ స్థానంలో నిలిచింది. ఈ షో తర్వత శ్రీముఖికి చాలా పాపులారిటీ వచ్చింది. వరస షోలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఎపుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటుంది శ్రీ ముఖి. ఎప్పటికపుడు తన యొక్క అప్డేట్స్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య లైవ్ లో అభిమానులతో ముచ్చటించింది, దానిలో ఫ్యాన్స్ అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం జరిగింది. మీరు ఏమైనా తప్పులు చేశారా అని అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీముఖి.

ఇతరుల ఫోన్ వారికి తెలియకుండా చూడడం తప్పని తెలిసి కూడా కొన్ని సార్లు చూడల్సి వచ్చింది అని చెప్పోకొచ్చింది. అంతే కాకుండా ఇంకో అభిమాని మీరు ఎవరితో అయిన లవ్ లో ఉన్నారా అని అడగగా హ అవును లవ్ లో ఉన్నాను అని సమాధానం ఇచ్చింది. కానీ ఎవరితో అనేది చెప్పలేదు. అతను ఎవరా అని అప్పుడే ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలెట్టారు. అయితే ఇంతకు ముందు శ్రీముఖి బాల నటుడు నుండి మొదలు పెట్టీ హీరోగా రాణించిన తనిష్ తో కొంత కాలం ప్రేమాయణం నడిపింది. కొంత కాలం డేటింగ్ చేసాక తనిష్ డ్రగ్స్ కి అలవాటు పడడం, అతని తండ్రి మరణించడంతో శ్రీముఖితో దూరం అవ్వడం జరిగింది. ఇపుడు తాజాగా మరొక ప్రేమాయణం మొదలవడంతో అతను ఎవరు అని ఫ్యాన్స్ చూస్తున్నారు.






























