సాధారణంగా కొన్ని సీజన్లలో మనకు కొన్ని పండ్లు మాత్రమే దొరుకుతూ ఉంటాయి. అలాంటి వాటిలో జామకాయ కూడా ఒకటి. కానీ రాను రాను జామకాయలు కూడా అన్ని సీజన్లలో అందుబాటులో ఉంటున్నాయి. జామకాయలు పేదవాడు యాపిల్ అనీ కూడా పిలుస్తారు. ఈ పండులోని చక్కెరలు విటమిన్లు మరియు ఖనిజాలు కానీ ఔషధ లక్షణాలు ప్రసిద్ధి. జామపండును తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే మరి షుగర్ పేషెంట్లు చలికాలంలో జామకాయలు తినవచ్చా? ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా అనే విషయాల గురించి తెలుసుకుందాం..

జామకాయలు డయాబెటిస్ రోగులకు చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా బరువు నియంత్రించడంలో జామకాయ సహాయపడుతుంది. అలాగే పండు ను తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది . ఇక జామకాయలు చలికాలంలో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి చేయడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది.
ఈ జామకాయలు మధుమేహ రోగులు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ అదుపులో ఉంటుంది. జామకాయ లే కాకుండా జామ ఆకులు కూడా ఎంతో మేలు చేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు జామ ఆకుల టీ తాగడం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్స్, రక రకాల విటమిన్స్ ఉంటాయి. ఇది ఫ్రీరాడికల్స్ వల్ల గుండె దెబ్బతినకుండా కాపాడతాయి.
జామకాయలో ఉండే పొటాషియం ఫైబర్ కారణంగా ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి కడుపులో వచ్చే తిమ్మిరి ని తగ్గిస్తుంది. అలాగే మహిళలకు నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. జామకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.





























