NTR: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కూడా వేగవంతం అయ్యాయి. అయితే ఎన్టీఆర్ అభిమానులను టార్గెట్ గా చేస్తూ కొడాలి నాని పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అన్న తారక రామారావు గారి నుంచి పార్టీ లాక్కొని ముఖ్యమంత్రిగా హోదా అనుభవిస్తున్నారు. నిజానికి ఈ పార్టీ పగ్గాలు నందమూరి వారసులకు రావాల్సి ఉండగా చంద్రబాబు నాయుడు లాక్కున్నారని విమర్శలు చేస్తూ వచ్చారు.

ఈ క్రమంలోనే నాని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పగ్గాలు తిరిగి ఎన్టీఆర్ చేతికి వెళ్ళాలి అంటే ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా తెలుగుదేశం పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని ఈయన పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు అధికారంలో కొనసాగుతూ పార్టీ పగ్గాలను తదుపరి తన కుమారుడు లోకేష్ కి ఇవ్వాలని భావిస్తున్నారు అలా జరగకుండా ఎన్టీఆర్ చేతికి పార్టీ పగ్గాలు రావాలి అంటే అభిమానులు అందరూ కూడా తెలుగుదేశం ఓటమికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ గారిని ఒక దుర్మార్గుడుగా చిత్రీకరించిన చంద్రబాబు నాయుడు పార్టీకి పనికిరారని తనని బయటకు తోసి పార్టీ పగ్గాలు అందుకున్న చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని తిరిగి పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ చేతికి ఇచ్చేలా చేయాలని తెలిపారు. తన కొడుకు రాజకీయ భవిష్యత్తుకు ఎన్టీఆర్ అడ్డు వస్తున్నారని తనని దూరం పెడుతూ వచ్చారు. ఎన్నోసార్లు ఎన్టీఆర్ ను అవమానించారు.
ఎన్టీఆర్ కే పార్టీ పగ్గాలు..
తన పార్టీ సభలకు వెళ్తే ఎన్టీఆర్ ఫోటోలు ఉన్నటువంటి ఫ్లెక్సీలు కనపడకుండా చేశారు. ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఎగబడుతున్నారు. ఈ విషయాలన్నింటిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుర్తుంచుకోవాలి అంటూ ఈ సందర్భంగా కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.



























