Kona Venkat : తెలుగు సినిమా రైటర్, ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్, తన పంచ్ డైలాగులకు బాగా ఫేమస్. దూకుడు, అదుర్స్, అల్లుడు శీను వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో హిందీ సినిమాలకు డబ్బింగ్ రైటర్ గా పనిచేసిన కోన వెంకట్ దాదాపు 50 సినిమాలకు పనిచేసాడు. ఇటీవలే తాను సినిమాల్లోకి వచ్చి ఇరవై ఏళ్ళు గడిచిన సందర్బంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక శీను వైట్ల కోన వెంకట్ జోడి సినిమాల్లో మంచి హిట్లు అందుకున్నారు. కానీ వాళ్ళ మధ్య విబేధాలు రావడంతో ఇద్దరూ మళ్ళీ కలిసి పనిచేయలేదు.

శీను వైట్ల అలా చేసినందుకు మేము దూరమయ్యాం…
ఇక దూకుడు సినిమా పూర్తవుతున్న సమయంలోనే ఆగడు గురించి చర్చ మొదలయింది. ఆ సమయంలో దూకుడు సినిమా కోసం అందరం కష్టపడితే, ఇతరులతో మాత్రం తానే అన్నీ చేసుకున్నట్లు శీను వైట్ల చెప్పుకున్నాడు. ప్రొడ్యూసర్లు మరి ఇంక వాళ్లెందుకు అని మా గురించి మాట్లాడారు. ఇక ఆ ఇష్యూ తరువాత అన్నీ తానే చేసుకుంటున్నపుడు మేమెందుకు అని నేను, గోపి మోహన్ వచ్చేసాం. గుర్తింపు లేని చోట పని చేయలేము అంటూ చెప్పారు కోన వెంకట్. గతంలో శీను వైట్ల అలా చేసాడు అంటూ చెప్పి ఇపుడు వాటి గురించి మాట్లాడటం వల్ల వచ్చేదేమీ లేదు అంటూ చెప్పారు.

చిన్న వాటికి ఫీల్ అవడం ఇప్పుడు మానేశాను ఒకప్పుడు చాలా బాధపడి, బాధ పెట్టినవాళ్ళను కడిగేయాలి అనే ఆలోచన ఉండేది, ఇప్పుడు అలాంటి వాటి నుండి బయటకు వచ్చేసాను అంటూ ఇక బాద్షా సినిమా సమయంలో జరిగిన చేదు సంఘటనలను కోన వెంకట్ చెప్పారు. బాద్షా కు శీను వైట్ల తో కలిసే పనిచేసాను అయితే ఆ సినిమా టైటిల్ కార్డ్స్ లో నా పేరు అలా 2 సెకన్లు కూడా రాలేదు, నేను చూసానా లేక రాలేదా అన్న అనుమానంతో పక్కన వాళ్ళను అడిగినా అలా వచ్చి అలా వెళ్ళిపోయింది అన్నారు. శీను పేరు మాత్రం ఒక 5 సెకన్లు ఉంది అపుడు బాధ అనిపించింది. కావాలనే శీను అలా చేసాడని అర్థమైంది అంటూ కోన చెప్పాడు.