Kona Venkat : తెలుగు సినిమా రైటర్, ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్, తన పంచ్ డైలాగులకు బాగా ఫేమస్. దూకుడు, అదుర్స్, అల్లుడు శీను వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో హిందీ సినిమాలకు డబ్బింగ్ రైటర్ గా పనిచేసిన కోన వెంకట్ దాదాపు 50 సినిమాలకు పనిచేసాడు. ఇటీవలే తాను సినిమాల్లోకి వచ్చి ఇరవై ఏళ్ళు గడిచిన సందర్బంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక శీను వైట్ల కోన వెంకట్ జోడి సినిమాల్లో మంచి హిట్లు అందుకున్నారు. కానీ వాళ్ళ మధ్య విబేధాలు రావడంతో ఇద్దరు మళ్ళీ కలిసి పనిచేయలేదు. ఇక సినిమా ఇండస్ట్రీ విషయాలను అలాగే రాజకీయాల గురించి కోన తన అభిప్రాయాలను చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ తో తన అనుబంధం గురించి తెలిపారు.

పవన్ ను విమర్శించిన కత్తి మహేష్ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు…
పవన్ కళ్యాణ్ ‘బాలు’ సినిమా అప్పటి నుండి బాగా తెలుసు. అయితే ‘గుడుంబా శంకర్’ సమయంలోనే నాగబాబు గారు పరిచయం ఉన్నారు. ఇక బాలు సినిమా అప్పటి నుండి నాకు పవన్ కి మధ్య స్నేహం మొదలయింది. నేను పవన్ కళ్యాణ్ ను సొల్ మేట్ అని పిలుస్తాను. అదేదో ఫ్యాషన కోసం నేను అలా పిలవను నాకు నిజంగా మా ఇద్దరి భావాలు కలిసాయి అనిపించింది కాబట్టే అలా పిలుస్తాను. పవన్ అంటాడు ఒక చిన్న పరిచయం కూడా విధి రాసిపెట్టుంటే జరుగుతుంది అని మనం కలవడం కూడా విధే అని చెప్పాడు.

ఇక పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు, తారక్ వీళ్లందరికీ ఉన్న ఒక పవర్ కొన్ని లక్షల మందిని కలవడం వల్ల ఎదుటి వారిని పసిగట్టేస్తారు, వాళ్ళు అసలు ఏ భావనతో వచ్చారు, వాళ్ళు నెగెటివ్ లేక పాజిటివ్ అనేది చెప్పేయగలరు. ఇక పవన్ ను దారుణంగా మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు. కత్తి మహేష్ బ్రతికి లేడు మాట్లాడకూడదు కానీ స్థాయి కి మించి పవన్ కళ్యాణ్ ను విమర్శించాడు చివరికి ఏమైంది.. అలానే ఇంకా చాలా మంది ఉన్నారు. పవన్ ను విమర్శించిన వాళ్ళకు ఏమైందో నాకు పవన్ కి తెలుసు అంటూ చెప్పారు కోన వెంకట్.


































