Nagababu: సినీ నటుడు నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన ఈ ఎన్నికలలో కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి కానీ కూటమిలో భాగంగా ఆయనకు టికెట్ రాలేకపోయింది కానీ తన తమ్ముడికి గెలుపు కోసం తన పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు.

ఇకపోతే నాగబాబు సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే ఆయన ఎవరినైతే టార్గెట్ చేశారో వారికి సూటిగా ఆ వ్యాఖ్యలు గుచ్చుకునేలా ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత తన తమ్ముడిపై ఉన్నటువంటి చెమట బొట్టులను తుడుస్తూ ఉన్నటువంటి ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నిన్ను నమ్మని వాళ్లకోసం ఎందుకు నిలబడతావు అని నేను అడిగితే తను మాత్రం చెట్టును చూపిస్తారు అది తనని నాటిన వారికి మాత్రమే నీడను ఇవ్వదని చెబుతారు. నీపై నిందలు వేసే వారికోసం ఎందుకు నిలబడతావు అని అడిగితే వర్షాన్ని చూపిస్తారు. తనని మొక్కనీ రైతు కంటతడపకుండా పంటనే తడుపుతుందని అప్పటినుంచి అడగటమే మానేశానని నాగబాబు తెలిపారు.
మార్గదర్శకు మెట్టు..
ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్ధం చేస్కోడం మొదలెట్టాను..సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది. సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది.. విజయీభవ..!అని నాగబాబు చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ ఫాన్స్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారని చెప్పాలి ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.





























