మెగా స్టార్ చిరంజీవి సినిమా అంటే అభిమానులకు పండగే.. రీ-ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు చిరు.. ఈ సినిమా రైతులకు సంబందించిన కథ ఆధారంగా చిరంజీవికి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. తదుపరి 151వ చిత్రం సైర నరసింహారెడ్డి సినిమా కూడా హిస్టారికల్ మూవీగా మరొక హిట్ ని చిరు ఖాతాలో వేసుకున్నాడు. ఇపుడు కొరటాల శివ దర్శకత్వంలో 152 వ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. చిరంజీవి సినిమా అనగానే అభిమానుల్లో భారీగా అంచనాలు పెరిగిపోతాయి. స్టార్ హీరో చిత్రం హాయిగా సాగిపోతూ ఉంటె మద్యలో అదిరిపోయే ట్విస్ట్ వచ్చిందంటే ఇక ఆ కిక్కే వేరుగా ఉంటుందని అభిమానులు అంటున్నారు. అదే ఇపుడు జరగబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిరు 152 వ చిత్రం దేవాలయశాఖలో జరగబోయే అక్రమాలపై జరిగే పోరాటం ఆధారంగా ఉంటుందని, ఇందులో ఒక షాక్ అయ్యే ట్విస్ట్ కూడా ఉందని, ఈ ట్విస్ట్ ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేస్తుందని చెబుతున్నారు. ఈ ట్విస్ట్ ఆధారంగానే సినిమా నడుస్తుందని, దాన్ని నమ్మే దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను రూపొందిస్తున్నారు అని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. దానిలో హీరోయిన్ రెజీనా తో, చిరు స్టెప్పులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ, తమిళ హీరో ఆర్య కూడా నటిస్తున్నారని వినికిడి, ఆర్యకి, చిరుకి మధ్య కీలకమైన సీన్స్ వుంటాయి అని, అవి సినిమా మొత్తానికే హైలెట్ గా నిలుస్తాయని సినిమా వర్గాల టాక్. అంతే కాకుండా ఖుష్బూ కూడా కీలక పాత్రలో నటిస్తుందని వస్తున్న న్యూస్ ఎంత వరకు నిజమో సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..































