Kota Srinivas Rao: తెలుగు సినీ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి అందరికీ పరిచయమే. నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన దర్శకుడుగా, నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు. తన నటనకు ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. ఎక్కువగా విలన్, సహాయ పాత్రలలో నటించాడు.

ప్రకాష్ రాజ్ తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇద్దరు అనే సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత హిట్లర్, చిరునవ్వుతో వంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. నెగటివ్ పాత్రలతో కూడా అద్భుతంగా నటించాడు. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ తండ్రి, తాత పాత్రలో నటిస్తున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించాడు ప్రకాష్ రాజ్.

ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటాడు. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ కు రాజకీయపరంగా, వ్యక్తిగత పరంగా ఇప్పటికే పలు విమర్శలు ఎదురయ్యాయి. అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా ఆయనకు పలు విమర్శలు కూడా ఎదురయ్యాయి.
ప్రకాష్ రాజ్ పై చేసిన కామెంట్స్ ఇవే..
కొన్ని కొన్ని సందర్భాలలో ఈయనతో నటించిన నటులు కూడా ఈయన గురించి చెబుతూ ఉంటారు. అలా తాజాగా ఈయన గురించి మరో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కూడా కొన్ని షాకింగ్ కామెంట్లు చేశాడు. ప్రకాష్ రాజ్ గురించి ఆయనకు ప్రశ్న ఎదురవడంతో ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పి.. ఆయన ఒక సినిమాకి కూడా టైం కి రాడు అని కామెంట్ చేశాడు.
ఇక ఈయన చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ప్రకాష్ రాజ్ గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ లో కూడా పాల్గొని ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కూడా ఈయన పలువురు సినీ ప్రముఖుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు.



























