తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్న వారిలో నటుడు కోట శ్రీనివాసరావు ఒకరు. పలు భాషలలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో విలన్ గా, తండ్రి పాత్రలో, తాత పాత్రలో, కమెడియన్ గా కూడా ఎంతో అద్భుతంగా నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటుడు.

ఒకానొక సమయంలో అతని డేట్స్ కుదరక దర్శకులు ఆయన ఏ సినిమా సెట్లో ఉంటే అక్కడికి కెమెరా పట్టుకుని వెళ్లి షాట్స్ తీసుకునేవారు అంటేనే అర్థమవుతుంది అతడు సినిమాలలో ఎంత బిజీగా ఉండే వాడు.ఈ విధంగా ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్న కోటశ్రీనివాసరావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తన సినీ కెరియర్ లో జరిగిన కొన్ని అనుభవాలను కొందరు నటీనటుల గురించి కోట శ్రీనివాస్ రావు ముచ్చటించారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ తనతో పాటు తనకు సహ నటుడిగా బాబుమోహన్ ఎంతో సుపరిచితమని, బాబు మోహన్ కోట మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉండేదని ఈ సందర్భంగా తెలియజేశారు. మామగారు సినిమాలో వీరి నటనకు ఎంతో అద్భుతమైన మార్కులు వచ్చాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సుమారు 40 నుంచి 50 వరకు సినిమాలు తెరకెక్కాయి అంటేనే వీరిద్దరి మధ్య నటన సంభాషణ ఎలా ఉండేదో అర్థమవుతుంది.

మామగారు సినిమాలో బిచ్చగాడి పాత్రలో బాబు మోహన్ ఎంతో అద్భుతంగా సహజంగా నటించారు. అయితే చాలామంది వీరిద్దరి మధ్య క్యాస్ట్ ఫీలింగ్ ఉందని భావించేవారు. అసలు మా మధ్య క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కోట శ్రీనివాస్ రావు వెల్లడించారు. మేమిద్దరం మంచి స్నేహితులని సినిమా షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు ఇద్దరికీ రెండు రూములు ఇచ్చినప్పటికీ ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉండేవారిమని.. ఆ సమయంలో వాడికి నేనే అన్నం కలిపి తినిపించే వాడినానని.. అంతగా మా మధ్య స్నేహబంధం ఉందని ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు వెల్లడించారు.






























