హైదరాబాద్ లో పండ్ల మార్కెట్ అంటే ఎక్కువగా గుర్తుకు వచ్చేది కొత్తపేట పండ్ల మార్కెట్. అక్కడికి ఎక్కడి నుంచో దిగుమతి అవుతూ.. నగరవాసులకు పండ్లను అందిస్తుంటాయి. ఆ మార్కెట్ పై అధారపడి చిన్న వ్యాపారస్తులు ఎందరో బతుకుతున్నారు. అయితే ఇక్కడ ఓ విషయం ఏంటంటే.. కొత్తపేట్ పండ్ల మార్కెట్ తరలింపునకు ముహూర్తం ఖరారైంది.

వచ్చే నెల అక్టోబర్ 1 నుంచి బాటసింగారంలో గల అతిపెద్ద పండ్ల మార్కెట్ కార్యకలాపాలను ఇప్పటికే మొదలు పెట్టారు. ప్రతీ ఒక్కరు ఈ విషయాన్ని గమనించాలని మార్కెట్ వైస్ చైర్మన్ ముత్యం రెడ్డి విలేకురుల సమావేశంలో పేర్కొన్నాడు. అసలేమైందంటే.. కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్లేస్ లో ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీనిపై కేసీఆర్ కూడా అధికారులను పనులు త్వరగా చేపట్టాలని ఆదేశించారు. సెప్టెంబర్ 25 అర్థరాత్రి నుంచే తరలింపు పనులు మొదలు కావాలని సూచించారు. ఇప్పటికే మార్కెట్ నుంచి రైతుల వెకేట్ చేసేస్తున్నారు. వాళ్లకు సంబంధించిన షాపులకు బాటసింగారంలోని మార్కెట్లో ఏర్పాటు చేసుకుంటున్నారు.
సెప్టెంబర్ 26 నుంచి మార్కెట్ ఉండదని.. దానిని మూసివేస్తున్నట్లు మార్కెట్ వైస్ చైర్మన్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించి రైతులకు , వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఎట్టి పరిస్తితుల్లో రేపటి నుంచి రైతులు, వ్యాపారులు మార్కెట్ కు సరుకులు తీసుకురావద్దంటూ సూచించారు. రేపటి నుంచి ఈ నెల చివరి వరకు అక్కడ మార్కెట్ కర్యకలాపాలు ఉండవని.. అక్టోబర్ 1 నుంచి బాటసింగారంలో మార్కెట్ ఓపెన్ కానుందన్నారు.






























